సామెతలు 25 : 1 (IRVTE)
{సొలొమోను మరికొన్ని సామెతలు} [PS] ఇవికూడా సొలొమోను సామెతలే. [PE][PS] యూదారాజు హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసారు. [PE][PS]
సామెతలు 25 : 2 (IRVTE)
విషయాన్ని గోప్యంగా ఉంచడం దేవునికి ఘనత. సంగతిని పరిశోధించడం రాజులకు ఘనత. [PE][PS]
సామెతలు 25 : 3 (IRVTE)
ఆకాశాల ఎత్తు, భూమి లోతు, రాజుల అభిప్రాయం అగమ్యగోచరం. [PE][PS]
సామెతలు 25 : 4 (IRVTE)
వెండిలోని కల్మషం తీసేస్తే లోహకారుడు తన పనితనంతో వస్తువు తయారు చేస్తాడు. [PE][PS]
సామెతలు 25 : 5 (IRVTE)
రాజు సముఖం నుండి దుష్టులను తొలగించ గలిగితే అతని సింహాసనం నీతిమూలంగా స్థిరం అవుతుంది. [PE][PS]
సామెతలు 25 : 6 (IRVTE)
రాజు ఎదుట నీ గొప్ప చెప్పుకోకు. గొప్పవారికి కేటాయించిన చోట ఉండవద్దు. [PE][PS]
సామెతలు 25 : 7 (IRVTE)
నీవు గమనించి చూసిన ప్రధాని ఎదుట ఎవరైనా నిన్ను తగ్గించడం కంటే “ఈ పైచోటికి రా” అని అతడు నీతో చెప్పడం మంచిది కదా. [PE][PS]
సామెతలు 25 : 8 (IRVTE)
అనాలోచితంగా న్యాయ స్థానానికి పోవద్దు. చివరికి నీ పొరుగువాడు నిన్ను అవమాన పరచి “ఇక నువ్వేమి చేస్తావు?” అని నీతో అంటాడు కదా. [PE][PS]
సామెతలు 25 : 9 (IRVTE)
నీ పొరుగువాడితో నీవు వాదులాడ వచ్చు గానీ ఎదుటి వ్యక్తి గుట్టు నలుగురిలో రట్టు చెయ్యవద్దు. [PE][PS]
సామెతలు 25 : 10 (IRVTE)
అలా చేస్తే వినేవాడు నిన్ను అవమానపరుస్తాడేమో. ఆ విధంగా నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికి మాసిపోదు. [PE][PS]
సామెతలు 25 : 11 (IRVTE)
సమయోచితంగా పలికిన మాట వెండి పళ్ళెంలో పొదిగిన బంగారు పండ్ల వంటిది. [PE][PS]
సామెతలు 25 : 12 (IRVTE)
బంగారు చెవిపోగులు ఎలాటివో స్వర్ణాభరణాలు ఎలాటివో వినే వాడి చెవికి జ్ఞానం గల ఉపదేశకుడు అలాటి వాడు. [PE][PS]
సామెతలు 25 : 13 (IRVTE)
నమ్మకమైన దూత తనను పంపిన వారిపాలిట కోతకాలపు [* కోతకాలపు వేసవి కాలం] మంచు చల్లదనం వంటి చల్లదనం గలవాడు. వాడు తన యజమానుల హృదయానికి ఆహ్లాదం కలిగిస్తాడు. [PE][PS]
సామెతలు 25 : 14 (IRVTE)
ఏమీ ఇవ్వకుండానే ఇచ్చానని సొంత డబ్బా వాయించుకునే వాడు వర్షం లేని మబ్బుతో గాలితో సమానం. [PE][PS]
సామెతలు 25 : 15 (IRVTE)
సహనంతో న్యాయాధిపతిని ఒప్పించవచ్చు. సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టగలదు. [PE][PS]
సామెతలు 25 : 16 (IRVTE)
నీకు తేనె దొరికితే మితంగా తిను. మితిమీరి తింటే ఒకవేళ కక్కి వేస్తావేమో. [PE][PS]
సామెతలు 25 : 17 (IRVTE)
మాటిమాటికి నీ పొరుగువాడి ఇంటికి వెళ్లకు. అతడు విసికిపోయి నిన్ను ద్వేషిస్తాడేమో. [PE][PS]
సామెతలు 25 : 18 (IRVTE)
తన పొరుగువాడిపై అబద్ధ సాక్ష్యం పలికేవాడు యుద్ధంలో వాడే గదలాంటి వాడు, కత్తిలాంటి వాడు. వాడియైన బాణం వంటివాడు. [PE][PS]
సామెతలు 25 : 19 (IRVTE)
కష్టకాలంలో విశ్వాస ఘాతకుణ్ణి ఆశ్రయించడం విరిగిన పన్నుతో, కీలు వసిలిన కాలుతో సమానం. [PE][PS]
సామెతలు 25 : 20 (IRVTE)
దుఃఖితుడి ఎదుట పాటలు వినిపించేవాడు చలి రోజున పైబట్ట తీసివేసే వాడితోను సూరేకారం మీద చిరక పోసే వాడితోను సమానం. [PE][PS]
సామెతలు 25 : 21 (IRVTE)
నీ పగవాడు ఆకలిగా ఉంటే వాడికి అన్నం పెట్టు. దాహంతో ఉంటే వాడికి మంచినీళ్ళు ఇవ్వు. [PE][PS]
సామెతలు 25 : 22 (IRVTE)
అలా చేస్తే వాడి తలపై నిప్పులు కుప్పగా పోసిన వాడివౌతావు [† అలా చేస్తే వాడి తలపై నిప్పులు కుప్పగా పోసిన వాడివౌతావు ఈ విధముగా చేస్తే అది అతనికి సిగ్గు ] . యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిస్తాడు. [PE][PS]
సామెతలు 25 : 23 (IRVTE)
ఉత్తర వాయువు వాన తెస్తుంది. అలానే గుట్టు బయట పెట్టేవాడి ముఖం గంభీరంగా ఉంటుంది. [PE][PS]
సామెతలు 25 : 24 (IRVTE)
గయ్యాళితో పెద్ద భవంతిలో ఉండడం కంటే మిద్దెమీద ఒక మూలన ఉండడమే హాయి. [PE][PS]
సామెతలు 25 : 25 (IRVTE)
దప్పిగొన్నవాడికి చల్లని నీరు ఎలాగో దూరదేశం నుండి వచ్చిన శుభసమాచారం అలా. [PE][PS]
సామెతలు 25 : 26 (IRVTE)
కలకలు అయిపోయిన ఊట, చెడిపోయిన నీటిబుగ్గ, ఉత్తముడు దుష్టుడికి లోబడి ఉండడం ఒకటే. [PE][PS]
సామెతలు 25 : 27 (IRVTE)
తేనె మితిమీరి తినడం మంచిది కాదు. గొప్ప కోసం అదే పనిగా పాకులాడడం అలాటిదే. [PE][PS]
సామెతలు 25 : 28 (IRVTE)
ప్రాకారం లేక పాడైన పురం ఎంతో తన మనస్సు అదుపు చేసుకోలేని వాడు అంతే. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: