సామెతలు 8 : 2 (IRVTE)
జ్ఞానం కేకలు పెడుతూ ఉంది. వివేకం పెద్దగా తన స్వరం వినిపిస్తూ ఉంది.
సామెతలు 8 : 3 (IRVTE)
రహదారుల్లో, ప్రధాన వీధుల్లో, పట్టణ దారులు కలిసే కూడలిలో అది నిలబడి ఉంది.
సామెతలు 8 : 4 (IRVTE)
నగర ప్రధాన ద్వారం దగ్గర, ఇంటి గుమ్మాల దగ్గర, పట్టణపు కేంద్రాల దగ్గర నిలబడి జ్ఞానం బిగ్గరగా ఇలా ప్రకటిస్తూ ఉంది.
సామెతలు 8 : 5 (IRVTE)
“మనుషులారా, ఈ మాటలు మీకోసమే. మనుషులైన మీకే నా మాటలు వినిపిస్తున్నాను.
సామెతలు 8 : 6 (IRVTE)
జ్ఞానం లేని మనుషులారా, జ్ఞానం అంటే ఏమిటో తెలుసుకోండి. బుద్ధిహీనులారా, బుద్ధి అంటే ఎలాంటిదో ఆలోచించి గ్రహించండి.
సామెతలు 8 : 7 (IRVTE)
వినండి, నేను అతి ప్రాముఖ్యమైన విషయాలు చెబుతాను. నా పెదవులు యథార్థమైన మాటలు మాట్లాడతాయి.
సామెతలు 8 : 8 (IRVTE)
నేను నిజమైన మాటలు చెబుతాను. చెడుతనం అంటే నాకు అసహ్యం.
సామెతలు 8 : 9 (IRVTE)
న్యాయమైన మాటలే నేను చెబుతాను. నేను చెప్పే మాటల్లో కపటం, మూర్ఖత్వం ఏమీ ఉండదు.
సామెతలు 8 : 10 (IRVTE)
నా మాటలన్నీ వివేకం గలవాడికి తేటగా అర్థం అవుతాయి. తెలివి గలవాడు న్యాయం గ్రహిస్తాడు.
సామెతలు 8 : 11 (IRVTE)
వెండి కోసం, స్వచ్ఛమైన బంగారం కోసం ఆశ పడకుండా నా ఉపదేశం అంగీకరించి, తెలివితేటలు సంపాదించుకోండి.
సామెతలు 8 : 12 (IRVTE)
విలువైన ముత్యాల కంటే జ్ఞానం శ్రేష్ఠమైనది. జ్ఞానంతో అత్యంత విలువైన ధన సంపదలు సాటిరావు.
సామెతలు 8 : 13 (IRVTE)
నాలో జ్ఞానం, వివేకం నివసిస్తున్నాయి. మంచి చెడ్డలు ఏమిటో నేను గ్రహించగలను.
సామెతలు 8 : 14 (IRVTE)
దుష్టత్వాన్ని అసహ్యించుకోవడం అంటే యెహోవాపట్ల భయభక్తులు గలిగి ఉండడమే. గర్వం, అహంకారం, దుర్మార్గం, కుటిలమైన మాటలు నాకు హేయం.
సామెతలు 8 : 15 (IRVTE)
అమితమైన జ్ఞానం, వివేకంతో కూడిన ఆలోచనలు నేనే అనుగ్రహిస్తాను. జ్ఞానానికి బల ప్రభావాలకు ఆధారం నేనే.
సామెతలు 8 : 16 (IRVTE)
నా మూలంగా రాజులు పరిపాలిస్తారు. అధికారులు న్యాయమైన చట్టాలు నియమిస్తారు.
సామెతలు 8 : 17 (IRVTE)
నా మూలంగా ఘనత వహించిన న్యాయాధిపతులంతా న్యాయం జరిగిస్తారు. లోకంలోని అధికారులు పాలన సాగిస్తారు.
సామెతలు 8 : 18 (IRVTE)
నన్ను ప్రేమించే వాళ్ళను నేను ప్రేమిస్తున్నాను. నన్ను జాగ్రత్తగా వెదికే వాళ్ళు నన్ను కనుక్కుంటారు.
సామెతలు 8 : 19 (IRVTE)
ఐశ్వర్యం, ప్రతిష్ఠ, నీతి న్యాయాలు, విస్తారమైన సంపదలు నా నుండి వస్తాయి.
సామెతలు 8 : 20 (IRVTE)
నా వల్ల కలిగే ఫలం బంగారం కంటే, మేలిమి బంగారం కంటే విలువైనది. నాణ్యమైన వెండి కంటే నా ద్వారా కలిగే సమృద్ధి ప్రయోజనకరమైనది.
సామెతలు 8 : 21 (IRVTE)
నేను నడిచే మార్గంలో నీతి, న్యాయాలు ఉన్నాయి.
సామెతలు 8 : 22 (IRVTE)
నన్ను ప్రేమించే వాళ్ళను నేను సంపన్నులుగా చేస్తాను. వారికి ధన సమృద్ధి కలిగిస్తాను.
సామెతలు 8 : 23 (IRVTE)
గడిచిన కాలంలో దేవుడు తన సృష్టి ప్రారంభంలో తన పనుల్లో ప్రాముఖమైన దానిగా నన్ను కలుగజేశాడు.
సామెతలు 8 : 24 (IRVTE)
అనాది కాలంలోనే ఆరంభం నుండి సృష్టి జరగకముందే ఆయన నన్ను నియమించాడు.
సామెతలు 8 : 25 (IRVTE)
ప్రవాహించే నదులు లేనప్పుడు, నీటి ఊటలు ఇంకా పుట్టనప్పుడు నేను రూపుదిద్దుకున్నాను.
సామెతలు 8 : 26 (IRVTE)
పర్వతాలు స్థిరం కాక ముందు, కొండలు ఉనికిలోకి రాకముందు నేను పుట్టాను.
సామెతలు 8 : 27 (IRVTE)
ఆయన ఇంకా భూమినీ, మైదానాలనూ చేయకముందే, నేలపై మట్టిని సిద్ధం చేయకముందే నేను పుట్టాను.
సామెతలు 8 : 28 (IRVTE)
ఆయన ఆకాశాలను స్థిరపరచి, జలాగాథాలకు పరిమితులు నిర్ణయించినప్పుడు నేను అక్కడే ఉన్నాను.
సామెతలు 8 : 29 (IRVTE)
ఆయన ఆకాశాన్ని స్థిరపరచినప్పుడు, జలధారలకు పరిథి ఉంచినప్పుడు నేను ఉన్నాను.
సామెతలు 8 : 30 (IRVTE)
భూమికి పునాదులు వేసినప్పుడు, సముద్ర జలాలు తమ సరిహద్దులు దాటకుండా సముద్రాలకు పొలిమేరలు ఏర్పరచినప్పుడు నేను ఉన్నాను.
సామెతలు 8 : 31 (IRVTE)
నేను ఆయనతోనే ఉన్నాను. ఆయన ముఖ్యమైన శిల్పకారుణ్ణి నేనే. నిరంతరం ఆయన నన్ను గూర్చి ఆనందించాడు. ఆయన సన్నిధిలో నేను నిత్యమూ ఆనందిస్తున్నాను.
సామెతలు 8 : 32 (IRVTE)
ఆయన సృష్టించిన లోకాన్నిబట్టి, భూమిని బట్టి నాకు సంతోషం కలుగుతుంది. భూమిపై ఉన్న మానవ జాతిని చూసి ఆనందిస్తున్నాను.
సామెతలు 8 : 33 (IRVTE)
కుమారులారా, నా మాట శ్రద్ధగా వినండి. నేను చెప్పే మార్గాలు అనుసరించే వాళ్ళు ధన్యులు.
సామెతలు 8 : 34 (IRVTE)
నా ఉపదేశాలను నిర్యక్షం చేయకుండా వాటిని పాటించి వివేకంతో నడుచుకోండి.
సామెతలు 8 : 35 (IRVTE)
నా ఉపదేశం వినేవాళ్ళు ధన్యులు. ప్రతిరోజూ నా గుమ్మం దగ్గర కనిపెట్టుకుని నా గుమ్మం తలుపుల దగ్గర నా కోసం కాచుకుని నా ఉపదేశం వినేవారు ధన్యులు.
సామెతలు 8 : 36 (IRVTE)
నన్ను కనుగొన్నవాడు జీవాన్ని సంపాదించుకుంటాడు. యెహోవా అనుగ్రహం అతనికి ప్రాప్తిస్తుంది. నన్ను తృణీకరించేవాడు తనకు తానే హాని కలిగించుకుంటాడు. నన్ను అసహ్యించుకొనే వాళ్ళు మరణానికి స్నేహితులౌతారు.”
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36