కీర్తనల గ్రంథము 102 : 1 (IRVTE)
బాధితుడి ప్రార్థన, దుఃఖంలో సోలిపోయి యెహోవా సన్నిధిలో పెట్టిన మొర. యెహోవా, నా ప్రార్థన విను, నా మొర నీకు చేరనివ్వు.
కీర్తనల గ్రంథము 102 : 2 (IRVTE)
నా కష్టసమయాన నీ ముఖం నాకు దాచవద్దు. నా మాట విను. నేను నిన్ను పిలిచినప్పుడు వెంటనే నాకు జవాబివ్వు.
కీర్తనల గ్రంథము 102 : 3 (IRVTE)
పొగ లాగా నా రోజులు గతించిపోతున్నాయి. నా ఎముకలు కాలిపోతున్నట్టు ఉన్నాయి.
కీర్తనల గ్రంథము 102 : 4 (IRVTE)
నా గుండె కుంగిపోయింది. నేను వాడిన గడ్డి పరకలాగా ఉన్నాను. నేనేమీ తినలేక పోతున్నాను.
కీర్తనల గ్రంథము 102 : 5 (IRVTE)
నేను ఆపకుండా మూలుగుతూ ఉండడం వలన చాలా చిక్కిపోయాను.
కీర్తనల గ్రంథము 102 : 6 (IRVTE)
నేను అడవి గూడబాతులాంటి వాణ్ణి. పాడుబడిపోయిన చోట్ల ఉండే గుడ్లగూబలాంటి వాణ్ణి.
కీర్తనల గ్రంథము 102 : 7 (IRVTE)
ఇంటిమీద ఏకాకిగా కూర్చున్న ఒంటరి పిట్టలాగా రాత్రంతా మెలకువగా ఉన్నాను.
కీర్తనల గ్రంథము 102 : 8 (IRVTE)
రోజంతా నా విరోధులు నా మీద వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. నన్ను నిందించేవాళ్ళు నా పేరు ఎత్తి శపిస్తారు.
కీర్తనల గ్రంథము 102 : 9 (IRVTE)
బూడిదను అన్నం లాగా తింటున్నాను. కన్నీళ్ళతో కలిపి నీళ్ళు తాగుతున్నాను.
కీర్తనల గ్రంథము 102 : 10 (IRVTE)
నీ కోపాగ్నిని బట్టి నువ్వు నన్ను పైకెత్తి అవతల పారేశావు.
కీర్తనల గ్రంథము 102 : 11 (IRVTE)
నా రోజులు అదృశ్యమయ్యే నీడలా ఉన్నాయి, గడ్డిలాగా నేను వాడిపోయాను.
కీర్తనల గ్రంథము 102 : 12 (IRVTE)
అయితే యెహోవా, నువ్వు శాశ్వతంగా ఉంటావు. నీ కీర్తి తరతరాలుంటుంది.
కీర్తనల గ్రంథము 102 : 13 (IRVTE)
నువ్వు లేచి సీయోనును కనికరిస్తావు. దానిమీద దయ చూపడానికి సరైన సమయం వచ్చింది.
కీర్తనల గ్రంథము 102 : 14 (IRVTE)
దాని రాళ్లంటే నీ సేవకులకు ఎంతో ఇష్టం. దాని శిథిలాల దుమ్ము అంటే వారికి వాత్సల్యం.
కీర్తనల గ్రంథము 102 : 15 (IRVTE)
యెహోవా, రాజ్యాలు నీ నామాన్ని గౌరవిస్తాయి, ప్రపంచ రాజులంతా నీ గొప్పదనాన్ని గౌరవిస్తారు.
కీర్తనల గ్రంథము 102 : 16 (IRVTE)
యెహోవా సీయోనును తిరిగి కట్టిస్తాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమవుతాడు.
కీర్తనల గ్రంథము 102 : 17 (IRVTE)
అప్పుడు ఆయన దిక్కులేని వాళ్ళ ప్రార్థనకు స్పందిస్తాడు. వాళ్ళ ప్రార్థన ఆయన నిరాకరించడు.
కీర్తనల గ్రంథము 102 : 18 (IRVTE)
రాబోయే తరాలకు ఇది రాసి పెట్టి ఉంటుంది, ఇంకా పుట్టని ప్రజలు యెహోవాను స్తుతిస్తారు.
కీర్తనల గ్రంథము 102 : 19 (IRVTE)
బందీల మూలుగులు వినడానికీ చావు ఖరారైన వాళ్ళను విడిపించడానికీ,
కీర్తనల గ్రంథము 102 : 20 (IRVTE)
యెహోవా ఉన్నతమైన పవిత్ర స్థలం నుంచి కిందికి చూశాడు, పరలోకం నుంచి భూమిని చూశాడు.
కీర్తనల గ్రంథము 102 : 21 (IRVTE)
యెహోవాను సేవించడానికి రాజ్యాలూ ప్రజలూ సమకూడినప్పుడు,
కీర్తనల గ్రంథము 102 : 22 (IRVTE)
మనుషులు యెహోవా నామాన్ని సీయోనులో ప్రకటిస్తారు. యెరూషలేములో ఆయన కీర్తిని ప్రకటిస్తారు.
కీర్తనల గ్రంథము 102 : 23 (IRVTE)
ఆయన నా యవ్వనంలో నా బలం తీసేశాడు. నా రోజులు తగ్గించేసాడు.
కీర్తనల గ్రంథము 102 : 24 (IRVTE)
నేనిలా అన్నాను, నా దేవా, నడివయస్సులో నన్ను తీసి వేయవద్దు. నువ్వు తరతరాలూ ఇక్కడ ఉన్నావు.
కీర్తనల గ్రంథము 102 : 25 (IRVTE)
పురాతన కాలంలో నువ్వు భూమిని స్థాపించావు, ఆకాశాలు నీ చేతిపనులే.
కీర్తనల గ్రంథము 102 : 26 (IRVTE)
అవి అంతరించిపోతాయి. కానీ నువ్వు నిలిచి ఉంటావు. అవన్నీ బట్టల్లాగా పాతవై పోతాయి. నువ్వు వాటిని దుస్తుల్లాగా మార్చి వేస్తావు. అవి ఇక కనబడవు.
కీర్తనల గ్రంథము 102 : 27 (IRVTE)
అయితే నువ్వు అలానే ఉన్నావు, నీ సంవత్సరాలకు అంతం లేదు.
కీర్తనల గ్రంథము 102 : 28 (IRVTE)
నీ సేవకుల పిల్లలు నిలిచి ఉంటారు. వారి వంశస్థులు నీ సన్నిధిలో జీవిస్తారు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28