కీర్తనల గ్రంథము 103 : 1 (IRVTE)
దావీదు కీర్తన. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు. నా అంతరంగమా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించు.
కీర్తనల గ్రంథము 103 : 2 (IRVTE)
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలన్నీ మరచిపోవద్దు.
కీర్తనల గ్రంథము 103 : 3 (IRVTE)
ఆయన నీ పాపాలన్నీ క్షమిస్తాడు. నీ జబ్బులన్నీ బాగుచేస్తాడు.
కీర్తనల గ్రంథము 103 : 4 (IRVTE)
నాశనాన్నుంచి నీ ప్రాణాన్ని విడుదల చేస్తాడు. కృప, వాత్సల్యం నీకు కిరీటంగా ఉంచాడు.
కీర్తనల గ్రంథము 103 : 5 (IRVTE)
నీ యవ్వనం గరుడ పక్షిలాగా కొత్తదనం సంతరించుకున్నట్టు మేలైన వాటితో నీ జీవితాన్ని తృప్తిపరుస్తాడు.
కీర్తనల గ్రంథము 103 : 6 (IRVTE)
యెహోవా న్యాయమైన దాన్ని జరిగిస్తాడు. అణగారిన వారందరికీ న్యాయం చేస్తాడు.
కీర్తనల గ్రంథము 103 : 7 (IRVTE)
ఆయన మోషేకు తన విధానాలూ ఇశ్రాయేలు వంశస్థులకు తన కార్యాలూ తెలియచేశాడు.
కీర్తనల గ్రంథము 103 : 8 (IRVTE)
యెహోవా దయాళువు, కృపాభరితుడు. ఆయన సహనశీలి, నిబంధన సంబంధమైన నమ్మకత్వం ఆయనలో ఉంది.
కీర్తనల గ్రంథము 103 : 9 (IRVTE)
ఆయన ఎప్పుడూ అదుపులో పెట్టేవాడు కాదు. ఆయన అస్తమానం కోపంగా ఉండడు.
కీర్తనల గ్రంథము 103 : 10 (IRVTE)
మన పాపాలకు తగినట్టు ఆయన మనతో వ్యవహరించలేదు. మన పాపాలకు సరిపోయినంతగా మనకు ప్రతీకారం చేయలేదు.
కీర్తనల గ్రంథము 103 : 11 (IRVTE)
భూమికంటే ఆకాశం ఎంత ఉన్నతమో తనను గౌరవించేవారి పట్ల ఆయన కృప అంత ఉన్నతం.
కీర్తనల గ్రంథము 103 : 12 (IRVTE)
పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపాల అపరాధ భావన కూడా మననుంచి అంత దూరం చేశాడు.
కీర్తనల గ్రంథము 103 : 13 (IRVTE)
తండ్రి తన పిల్లలను జాలితో చూసినట్టు, యెహోవా తనను గౌరవించే వాళ్ళను జాలితో చూసుకుంటాడు.
కీర్తనల గ్రంథము 103 : 14 (IRVTE)
మనం ఎలా సృష్టి అయ్యామో ఆయనకు తెలుసు, మనం మట్టి అని ఆయనకు తెలుసు.
కీర్తనల గ్రంథము 103 : 15 (IRVTE)
మనిషి రోజులు గడ్డి మొక్కలాంటివి. పొలంలో పూసే పువ్వులాగా అతడు పూస్తాడు.
కీర్తనల గ్రంథము 103 : 16 (IRVTE)
దానిమీద గాలి వీస్తే అది ఇక ఉండదు.
కీర్తనల గ్రంథము 103 : 17 (IRVTE)
యెహోవాను గౌరవించే వారి పట్ల ఆయన కృప తరతరాలకూ ఉంటుంది. ఆయన నీతి వారి వారసులకు కొనసాగుతుంది.
కీర్తనల గ్రంథము 103 : 18 (IRVTE)
వాళ్ళు ఆయన నిబంధన పాటిస్తారు. ఆయన ఆదేశాలను మనసులో ఉంచుకుంటారు.
కీర్తనల గ్రంథము 103 : 19 (IRVTE)
యెహోవా పరలోకంలో తన సింహాసనాన్ని సుస్థిరం చేశాడు. ఆయన రాజ్యం అందరినీ పాలిస్తూ ఉంది.
కీర్తనల గ్రంథము 103 : 20 (IRVTE)
యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన మాట వినే బలాశాలురైన మీరంతా, ఆయనను స్తుతించండి.
కీర్తనల గ్రంథము 103 : 21 (IRVTE)
యెహోవా సేనలారా, ఆయన సంకల్పం నెరవేర్చే సేవకులైన మీరంతా ఆయనను స్తుతించండి.
కీర్తనల గ్రంథము 103 : 22 (IRVTE)
యెహోవా చేసిన జీవులారా, ఆయనను స్తుతించండి. ఆయన రాజ్యంలోని ప్రతి ప్రదేశంలో ఉన్న మీరంతా ఆయనను స్తుతించండి. నా ప్రాణమా, యెహోవాను స్తుతించు.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22