కీర్తనల గ్రంథము 105 : 1 (IRVTE)
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ప్రకటన చేయండి. జాతుల్లో ఆయన కార్యాలను తెలియచేయండి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 2 (IRVTE)
ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 3 (IRVTE)
ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 4 (IRVTE)
యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 5 (IRVTE)
ఆయన సేవకుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతివారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 6 (IRVTE)
ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 7 (IRVTE)
ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అంతటా అమలు అవుతున్నాయి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 8 (IRVTE)
తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరాల వరకూ ఆయన గుర్తుంచుకుంటాడు. అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను, [QBR]
కీర్తనల గ్రంథము 105 : 9 (IRVTE)
ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణాన్ని, నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 10 (IRVTE)
వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, ఆ కొద్ది మంది ఆ దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు, [QBR]
కీర్తనల గ్రంథము 105 : 11 (IRVTE)
కొలిచిన వారసత్వంగా కనాను దేశం మీకిస్తానని ఆయన చెప్పాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 12 (IRVTE)
ఆ మాట యాకోబుకు శాసనంగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరచాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 13 (IRVTE)
వారు జనం నుండి జనానికి, రాజ్యం నుండి రాజ్యానికి తిరుగులాడుతుండగా [QBR]
కీర్తనల గ్రంథము 105 : 14 (IRVTE)
వారిని హింసించడానికి ఆయన ఎవరినీ అనుమతించలేదు. ఆయన వారి కోసం రాజులను శిక్షించాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 15 (IRVTE)
నేను అభిషేకించిన వారిని తాకవద్దు, నా ప్రవక్తలకు హాని చేయవద్దు అని ఆయన చెప్పాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 16 (IRVTE)
దేశం మీదికి ఆయన కరువు రప్పించాడు. జీవనాధారమైన ధాన్యమంతా ధ్వంసం చేశాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 17 (IRVTE)
వారికంటే ముందుగా ఆయన ఒకణ్ణి పంపించాడు. వారు యోసేపును బానిసగా అమ్మేశారు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 18 (IRVTE)
వారు సంకెళ్లతో అతని కాళ్లు నొప్పించారు. ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 19 (IRVTE)
అతడు చెప్పిన సంగతి నెరవేరేదాకా యెహోవా వాక్కు అతణ్ణి పరీక్షించాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 20 (IRVTE)
రాజు వర్తమానం పంపి అతణ్ణి విడిపించాడు. ప్రజల పాలకుడు అతణ్ణి విడుదల చేశాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 21 (IRVTE)
ఇష్టప్రకారం అతడు తన అధిపతులపై పెత్తనం చెయ్యడానికి, తన పెద్దలకు బుద్ధి చెప్పడానికి, [QBR]
కీర్తనల గ్రంథము 105 : 22 (IRVTE)
తన ఇంటికి యజమానిగా, తన ఆస్తి అంతటిపై అధికారిగా అతణ్ణి నియమించాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 23 (IRVTE)
ఇశ్రాయేలు ఈజిప్టులోకి వచ్చాడు. యాకోబు హాము దేశంలో పరదేశిగా ఉన్నాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 24 (IRVTE)
ఆయన తన ప్రజల సంతానాన్ని వృద్ధి చేశాడు. వారి విరోధులకంటే వారికి అధికబలం దయచేశాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 25 (IRVTE)
తన ప్రజలపై పగబట్టేలా తన సేవకుల పట్ల కుయుక్తిగా నడుచుకునేలా ఆయన వారి హృదయాలను మళ్ళించాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 26 (IRVTE)
ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకున్న అహరోనును పంపించాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 27 (IRVTE)
వారు ఐగుప్తీయుల మధ్య ఆయన సూచక క్రియలను, హాము దేశంలో మహత్కార్యాలను జరిగించారు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 28 (IRVTE)
ఆయన అంధకారం పంపించి చీకటి కమ్మేలా చేశాడు. వారు ఆయన మాటను ఎదిరించలేదు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 29 (IRVTE)
ఆయన వారి జలాలను రక్తంగా మార్చాడు. వారి చేపలను చంపాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 30 (IRVTE)
వారి దేశంలో కప్పలు నిండిపోయాయి. అవి వారి రాజుల గదుల్లోకి వచ్చాయి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 31 (IRVTE)
ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టాయి. వారి ప్రాంతాలన్నిటిలోకీ దోమలు వచ్చాయి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 32 (IRVTE)
ఆయన వారిమీద వడగండ్ల వాన కురిపించాడు. వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 33 (IRVTE)
వారి ద్రాక్షతీగెలను, వారి అంజూరు చెట్లను పడగొట్టాడు. వారి ప్రాంతాల్లో వృక్షాలను విరగగొట్టాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 34 (IRVTE)
ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలు, లెక్కలేనన్ని చీడపురుగులు వచ్చాయి, [QBR]
కీర్తనల గ్రంథము 105 : 35 (IRVTE)
అవి వారి దేశంలోని కూరగాయల చెట్లన్నిటిని, వారి భూమి పంటలను తినివేశాయి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 36 (IRVTE)
వారి దేశంలోని జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానాన్ని ఆయన హతం చేశాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 37 (IRVTE)
అక్కడనుండి తన ప్రజలను వెండి బంగారాలతో ఆయన రప్పించాడు. వారి గోత్రాల్లో నిస్సత్తువ చేత తొట్రిల్లేవాడొక్కడైనా లేడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 38 (IRVTE)
వారివలన ఐగుప్తీయులకు భయం వేసింది. వారు వెళ్లిపోయినప్పుడు ఐగుప్తీయులు సంతోషించారు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 39 (IRVTE)
వారికి నీడగా ఆయన మేఘాన్ని కల్పించాడు. రాత్రి వెలుగివ్వడానికి అగ్నిని కలగజేశాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 40 (IRVTE)
వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించాడు. ఆకాశంలోనుండి ఆహారాన్నిచ్చి వారిని తృప్తి పరిచాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 41 (IRVTE)
శిలను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాయి. ఎడారుల్లో అవి ఏరులై ప్రవహించాయి. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 42 (IRVTE)
ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ వాగ్దానాన్ని, తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని, [QBR]
కీర్తనల గ్రంథము 105 : 43 (IRVTE)
తన ప్రజలను సంతోషంతోను, తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను బయటికి రప్పించాడు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 44 (IRVTE)
అన్యజనుల భూములను ఆయన వారికప్పగించాడు. ఇతర జాతుల సౌభాగ్యాన్ని వారు స్వాధీనపరచుకున్నారు. [QBR]
కీర్తనల గ్రంథము 105 : 45 (IRVTE)
వారు తన కట్టడలను గైకొనేలా, తన ధర్మశాస్త్రవిధులను ఆచరించేలా చేయడానికి ఆయనిలా చేశాడు. యెహోవాను స్తుతించండి. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45

BG:

Opacity:

Color:


Size:


Font: