కీర్తనల గ్రంథము 106 : 1 (IRVTE)
యెహోవాను స్తుతించండి. యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం ఉంటుంది.
కీర్తనల గ్రంథము 106 : 2 (IRVTE)
యెహోవా పరాక్రమ కార్యాలను వర్ణించగలవాడెవడు? ఆయన కీర్తి అంతటినీ ఎవడు ప్రకటించగలడు?
కీర్తనల గ్రంథము 106 : 3 (IRVTE)
న్యాయం అనుసరించేవారు, ఎల్లవేళలా నీతిననుసరించి నడుచుకునేవారు ధన్యులు.
కీర్తనల గ్రంథము 106 : 4 (IRVTE)
యెహోవా, నీవు ఏర్పరచుకున్నవారి క్షేమం నేను చూస్తూ నీ ప్రజలకు కలిగే సంతోషాన్ని బట్టి నేను సంతోషిస్తూ,
కీర్తనల గ్రంథము 106 : 5 (IRVTE)
నీ వారసత్వ ప్రజతో కలిసి కొనియాడేలా నీ ప్రజల పట్ల నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకానికి తెచ్చుకో. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షించు.
కీర్తనల గ్రంథము 106 : 6 (IRVTE)
మా పితరుల్లాగానే మేము పాపం చేశాము. దోషాలు మూటగట్టుకుని భక్తిహీనులమైపోయాము.
కీర్తనల గ్రంథము 106 : 7 (IRVTE)
ఈజిప్టులో మా పూర్వీకులు నీ అద్భుతాలను గ్రహించలేదు. నీ కృపాబాహుళ్యం జ్ఞాపకం తెచ్చుకోలేదు. సముద్రం దగ్గర, ఎర్రసముద్రం దగ్గర వారు తిరుగు బాటు చేశారు.
కీర్తనల గ్రంథము 106 : 8 (IRVTE)
అయినా తన మహా పరాక్రమాన్ని ప్రసిద్ధి చేయడానికి ఆయన తన నామాన్నిబట్టి వారిని రక్షించాడు.
కీర్తనల గ్రంథము 106 : 9 (IRVTE)
ఆయన ఎర్రసముద్రాన్ని గద్దించగా అది ఆరిపోయింది. మైదానం మీద నడిచినట్టు ఆయన వారిని అగాధజలాల్లో నడిపించాడు.
కీర్తనల గ్రంథము 106 : 10 (IRVTE)
పగవారి చేతిలోనుండి వారిని రక్షించాడు. శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించాడు.
కీర్తనల గ్రంథము 106 : 11 (IRVTE)
నీళ్లు వారి శత్రువులను ముంచివేశాయి. వారిలో ఒక్కడైనా మిగల్లేదు.
కీర్తనల గ్రంథము 106 : 12 (IRVTE)
అప్పుడు వారు ఆయన మాటలు నమ్మారు. ఆయన కీర్తిని గానం చేశారు.
కీర్తనల గ్రంథము 106 : 13 (IRVTE)
అయినా వారు ఆయన కార్యాలను వెంటనే మర్చిపోయారు. ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకోలేదు.
కీర్తనల గ్రంథము 106 : 14 (IRVTE)
అరణ్యంలో వారు ఎంతో ఆశించారు. ఎడారిలో దేవుణ్ణి పరీక్షించారు.
కీర్తనల గ్రంథము 106 : 15 (IRVTE)
వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు. అయినా వారి ప్రాణాలకు ఆయన క్షీణత కలగజేశాడు.
కీర్తనల గ్రంథము 106 : 16 (IRVTE)
వారు తమ శిబిరంలో మోషేపైనా యెహోవాకు ప్రతిష్ఠితుడు అహరోనుపైనా అసూయపడ్డారు.
కీర్తనల గ్రంథము 106 : 17 (IRVTE)
భూమి నెర్రె విచ్చి దాతానును మింగేసింది. అది అబీరాము బృందాన్ని కప్పేసింది.
కీర్తనల గ్రంథము 106 : 18 (IRVTE)
వారి మధ్యలో అగ్ని రగులుకుంది. దాని మంట భక్తిహీనులను కాల్చివేసింది.
కీర్తనల గ్రంథము 106 : 19 (IRVTE)
హోరేబులో వారు దూడను చేయించుకున్నారు. పోత పోసిన విగ్రహానికి మొక్కారు.
కీర్తనల గ్రంథము 106 : 20 (IRVTE)
తమ దేవుని మహిమను వారు గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చివేశారు.
కీర్తనల గ్రంథము 106 : 21 (IRVTE)
ఈజిప్టులో గొప్ప కార్యాలను, హాము దేశంలో ఆశ్చర్యకార్యాలను
కీర్తనల గ్రంథము 106 : 22 (IRVTE)
ఎర్రసముద్రం దగ్గర భయం గొలిపే క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు.
కీర్తనల గ్రంథము 106 : 23 (IRVTE)
అప్పుడు ఆయన “నేను వారిని నశింపజేస్తాను” అన్నాడు. అయితే ఆయన వారిని నశింపజేయకుండేలా ఆయన కోపం చల్లార్చడానికి ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిలో నిలిచి అడ్డుపడ్డాడు.
కీర్తనల గ్రంథము 106 : 24 (IRVTE)
రమ్యమైన దేశాన్ని వారు నిరాకరించారు. ఆయన మాట నమ్మలేదు.
కీర్తనల గ్రంథము 106 : 25 (IRVTE)
యెహోవా మాట వినకుండా వారు తమ గుడారాల్లో సణుగుకున్నారు.
కీర్తనల గ్రంథము 106 : 26 (IRVTE)
అప్పుడు అరణ్యంలో వారు కూలిపోయేలా చేయడానికి,
కీర్తనల గ్రంథము 106 : 27 (IRVTE)
అన్యజనులలో వారి సంతానాన్ని కూల్చడానికి, దేశంలో వారిని చెదరగొట్టడానికి ఆయన వారిపై చెయ్యి ఎత్తాడు.
కీర్తనల గ్రంథము 106 : 28 (IRVTE)
వారు బయల్పెయోరును హత్తుకుని, చచ్చిన వారికి అర్పించిన బలిమాంసాన్ని భుజించారు.
కీర్తనల గ్రంథము 106 : 29 (IRVTE)
వారు తమ క్రియలచేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో తెగులు చెలరేగింది.
కీర్తనల గ్రంథము 106 : 30 (IRVTE)
ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయింది.
కీర్తనల గ్రంథము 106 : 31 (IRVTE)
నిత్యం తరాలన్నిటిలో అతనికి ఆ పని నీతిగా ఎంచబడింది.
కీర్తనల గ్రంథము 106 : 32 (IRVTE)
మెరీబా జలాల దగ్గర వారు ఆయనకు కోపం పుట్టించారు. కాబట్టి వారి మూలంగా మోషేకు బాధ కలిగింది.
కీర్తనల గ్రంథము 106 : 33 (IRVTE)
ఎలాగంటే వారు అతనికి విరక్తి పుట్టించారు. ఫలితంగా అతడు తొందరపడి మాట్లాడాడు.
కీర్తనల గ్రంథము 106 : 34 (IRVTE)
యెహోవా వారికి ఆజ్ఞాపించినట్టు వారు అన్యజాతులను నాశనం చేయలేదు.
కీర్తనల గ్రంథము 106 : 35 (IRVTE)
అన్యజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నారు.
కీర్తనల గ్రంథము 106 : 36 (IRVTE)
వారి విగ్రహాలకు పూజ చేశారు. అవి వారికి ఉరి అయినాయి.
కీర్తనల గ్రంథము 106 : 37 (IRVTE)
వారు తమ కొడుకులను, తమ కూతుళ్ళను దయ్యాలకు బలిగా అర్పించారు.
కీర్తనల గ్రంథము 106 : 38 (IRVTE)
నిర్దోష రక్తం, అంటే తమ కొడుకుల రక్తం తమ కూతుళ్ళల రక్తం ఒలికించారు. కనాను జాతి వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. ఆ రక్తం వలన దేశం అపవిత్రం అయిపోయింది.
కీర్తనల గ్రంథము 106 : 39 (IRVTE)
తమ క్రియల వలన వారు అపవిత్రులైపోయారు. తమ నడవడిలో వ్యభిచారులయ్యారు.
కీర్తనల గ్రంథము 106 : 40 (IRVTE)
కాబట్టి యెహోవా కోపం ఆయన ప్రజల మీద రగులుకుంది. ఆయన తన వారసత్వంపై అసహ్యపడ్డాడు.
కీర్తనల గ్రంథము 106 : 41 (IRVTE)
ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించాడు. పగవారు వారిని ఏలారు.
కీర్తనల గ్రంథము 106 : 42 (IRVTE)
శత్రువులు వారిని బాధపెట్టారు. వారు శత్రువుల చేతి కింద అణగారిపోయారు.
కీర్తనల గ్రంథము 106 : 43 (IRVTE)
అనేక మార్లు ఆయన వారిని విడిపించాడు. అయినా వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగుబాటు చేస్తూ వచ్చారు. తమ పాపం మూలంగా హీనదశకు వెళ్ళిపోయారు.
కీర్తనల గ్రంథము 106 : 44 (IRVTE)
అయినా వారి రోదన తనకు వినబడగా వారికి కలిగిన బాధను ఆయన చూశాడు.
కీర్తనల గ్రంథము 106 : 45 (IRVTE)
వారిని తలంచుకుని ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. తన నిబంధన విశ్వాస్యతను బట్టి వారిని కరుణించాడు.
కీర్తనల గ్రంథము 106 : 46 (IRVTE)
వారిని చెరగొనిపోయిన వారికందరికీ వారంటే జాలి పుట్టించాడు.
కీర్తనల గ్రంథము 106 : 47 (IRVTE)
యెహోవా మా దేవా, మమ్మల్ని రక్షించు. మేము నీ పరిశుద్ధనామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా, నిన్ను స్తుతిస్తూ మేము గర్వించేలా అన్యజనుల్లో నుండి మమ్మల్ని పోగుచెయ్యి.
కీర్తనల గ్రంథము 106 : 48 (IRVTE)
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగయుగాలకూ స్తుతినొందు గాక. ప్రజలందరూ ఆమేన్‌ అందురు గాక. యెహోవాను స్తుతించండి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48