కీర్తనల గ్రంథము 107 : 1 (IRVTE)
యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యం ఉంటుంది.
కీర్తనల గ్రంథము 107 : 2 (IRVTE)
యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుతారు గాక. విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించిన వారూ,
కీర్తనల గ్రంథము 107 : 3 (IRVTE)
తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నానాదేశాల నుండి ఆయన పోగు చేసినవారూ ఆ మాట పలుకుతారు గాక.
కీర్తనల గ్రంథము 107 : 4 (IRVTE)
వారు అరణ్యమార్గాల్లో ఎడారి త్రోవల్లో తిరుగులాడుతూ ఉండే వారు. నివాస పురమేదీ వారికి దొరకలేదు.
కీర్తనల గ్రంథము 107 : 5 (IRVTE)
ఆకలి దప్పుల వల్ల వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లిపోయింది.
కీర్తనల గ్రంథము 107 : 6 (IRVTE)
వారు కష్టకాలంలో యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు.
కీర్తనల గ్రంథము 107 : 7 (IRVTE)
వారొక నివాస పురం చేరేలా చక్కని దారిలో ఆయన వారిని నడిపించాడు.
కీర్తనల గ్రంథము 107 : 8 (IRVTE)
ఆయన నిబంధన విశ్వసనీయతను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
కీర్తనల గ్రంథము 107 : 9 (IRVTE)
ఎందుకంటే దాహం గొన్న వారిని ఆయన తృప్తిపరచాడు. ఆకలి గొన్నవారిని మేలుతో నింపాడు.
కీర్తనల గ్రంథము 107 : 10 (IRVTE)
చీకటిలో మసక చీకటిలో కొందరు బాధతో, ఇనప గొలుసులతో బంధితులై కూర్చున్నారు.
కీర్తనల గ్రంథము 107 : 11 (IRVTE)
దేవుని మాటపై తిరుగుబాటు చేసినందువల్ల, మహోన్నతుని సూచనలను త్రోసిపుచ్చినందువల్ల ఇది జరిగింది.
కీర్తనల గ్రంథము 107 : 12 (IRVTE)
కడగండ్ల మూలంగా ఆయన వారి హృదయాలను లొంగదీశాడు. వారు తొట్రుపడినప్పుడు ఆదుకునేవాడు లేకపోయాడు.
కీర్తనల గ్రంథము 107 : 13 (IRVTE)
కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి దురవస్థలోనుండి వారిని విడిపించాడు
కీర్తనల గ్రంథము 107 : 14 (IRVTE)
వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండి, మరణాంధకారంలో నుండి వారిని బయటికి రప్పించాడు.
కీర్తనల గ్రంథము 107 : 15 (IRVTE)
ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
కీర్తనల గ్రంథము 107 : 16 (IRVTE)
ఎందుకంటే ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టాడు, ఇనపగడియలను విరగగొట్టాడు.
కీర్తనల గ్రంథము 107 : 17 (IRVTE)
బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తన చేత, తమ దోషం చేత, బాధ కొనితెచ్చుకుంటారు.
కీర్తనల గ్రంథము 107 : 18 (IRVTE)
భోజనపదార్థాలన్నీ వారి ప్రాణానికి అసహ్యమై పోతాయి. వారు మరణద్వారాలను సమీపిస్తారు.
కీర్తనల గ్రంథము 107 : 19 (IRVTE)
కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు.
కీర్తనల గ్రంథము 107 : 20 (IRVTE)
ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాడు.
కీర్తనల గ్రంథము 107 : 21 (IRVTE)
ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
కీర్తనల గ్రంథము 107 : 22 (IRVTE)
వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యాలను ప్రకటించుదురు గాక.
కీర్తనల గ్రంథము 107 : 23 (IRVTE)
ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేసేవారు మహాజలాల మీద తిరుగుతూ వ్యాపారం చేసేవారు
కీర్తనల గ్రంథము 107 : 24 (IRVTE)
యెహోవా కార్యాలను, సముద్రంలో ఆయన చేసే అద్భుతాలను చూశారు.
కీర్తనల గ్రంథము 107 : 25 (IRVTE)
ఆయన సెలవియ్యగా తుఫాను పుట్టింది. అది దాని తరంగాలను పైకెత్తింది.
కీర్తనల గ్రంథము 107 : 26 (IRVTE)
వారు ఆకాశందాకా ఎక్కుతూ అగాధానికి దిగుతూ ఉన్నారు. బాధతో వారి* వారి నావికులు ప్రాణం కరిగిపోయింది.
కీర్తనల గ్రంథము 107 : 27 (IRVTE)
మత్తెక్కిన వారివలె వారు ముందుకి, వెనక్కి దొర్లుతూ ఇటు అటు తూలుతూ ఉన్నారు. వారు ఏమీ తోచక ఉన్నారు.
కీర్తనల గ్రంథము 107 : 28 (IRVTE)
బాధకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు.
కీర్తనల గ్రంథము 107 : 29 (IRVTE)
ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగాలు అణిగిపోయాయి.
కీర్తనల గ్రంథము 107 : 30 (IRVTE)
అవి నిమ్మళమైపోయాయని వారు సంతోషించారు. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడు.
కీర్తనల గ్రంథము 107 : 31 (IRVTE)
ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
కీర్తనల గ్రంథము 107 : 32 (IRVTE)
జనసమాజంలో వారాయనను ఘనపరచుదురు గాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక.
కీర్తనల గ్రంథము 107 : 33 (IRVTE)
ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను,
కీర్తనల గ్రంథము 107 : 34 (IRVTE)
దేశనివాసుల చెడుతనాన్ని బట్టి సారవంతమైన భూమిని చవిటిపర్రగాను మార్చాడు.
కీర్తనల గ్రంథము 107 : 35 (IRVTE)
అడివిని నీటిమడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల తావుగాను ఆయన మార్చాడు.
కీర్తనల గ్రంథము 107 : 36 (IRVTE)
వారు అక్కడ నివాసస్థలం ఏర్పరచుకునేలా పొలంలో విత్తనాలు చల్లి, ద్రాక్షతోటలు నాటి,
కీర్తనల గ్రంథము 107 : 37 (IRVTE)
వాటివలన మంచి పంటలు పండిస్తూ ఉండేలా ఆయన ఆకలిగొన్న వారిని అక్కడ కాపురముంచాడు.
కీర్తనల గ్రంథము 107 : 38 (IRVTE)
ఆయన వారిని ఆశీర్వదించగా వారికి సంతానాభివృద్ధి కలిగింది. ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు.
కీర్తనల గ్రంథము 107 : 39 (IRVTE)
వారు బాధ వలనా ఇబ్బంది వలనా దుఃఖం వలనా తగ్గిపోయినప్పుడు,
కీర్తనల గ్రంథము 107 : 40 (IRVTE)
శత్రువులు రాజులను తృణీకరిస్తూ దారిలేని ఎడారిలో వారిని తిరుగులాడజేశాడు.
కీర్తనల గ్రంథము 107 : 41 (IRVTE)
అలాటి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తాడు. వారి వంశాన్ని మందవలె వృద్ధి చేశాడు.
కీర్తనల గ్రంథము 107 : 42 (IRVTE)
యథార్థవంతులు దాన్ని చూసి సంతోషిస్తారు. మోసగాళ్ళు మౌనంగా ఉంటారు.
కీర్తనల గ్రంథము 107 : 43 (IRVTE)
బుద్ధిమంతుడు ఈ విషయాలను ఆలోచిస్తాడు. యెహోవా కృపాతిశయాలను ప్రజలు తలపోస్తారు గాక.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43