కీర్తనల గ్రంథము 108 : 1 (IRVTE)
దేవా, నా హృదయం నిబ్బరంగా ఉంది. నేను పాడుతూ నా ఆత్మతో స్తుతిగానం చేస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 108 : 2 (IRVTE)
స్వరమండలమా, సితారా, మేలు మేలుకోండి. నేను వేకువనే లేస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 108 : 3 (IRVTE)
ప్రజలమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 108 : 4 (IRVTE)
యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తయినది. నీ సత్యం మేఘాలంత ఎత్తుగా ఉంది. [QBR]
కీర్తనల గ్రంథము 108 : 5 (IRVTE)
దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకో. [QBR]
కీర్తనల గ్రంథము 108 : 6 (IRVTE)
నీ ప్రభావం భూమి అంతటిమీదా కనబడనియ్యి. నీకు ఇష్టమైన వారు విమోచన పొందేలా నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు జవాబియ్యి. [QBR]
కీర్తనల గ్రంథము 108 : 7 (IRVTE)
తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చాడు. నేను హర్షిస్తాను. షెకెమును పంచిపెడతాను. సుక్కోతు లోయను కొలిపిస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 108 : 8 (IRVTE)
గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజ దండం. [QBR]
కీర్తనల గ్రంథము 108 : 9 (IRVTE)
మోయాబు నేను కాళ్లు కడుక్కునే పళ్ళెం. ఎదోముపైకి నా చెప్పు విసిరేస్తాను. ఫిలిష్తియనుబట్టి జయోత్సవం చేశాను. [QBR]
కీర్తనల గ్రంథము 108 : 10 (IRVTE)
కోటగల పట్టణంలోకి నన్ను ఎవరు తోడుకుపోతారు? ఎదోములోకి నన్నెవరు నడిపిస్తారు? [QBR]
కీర్తనల గ్రంథము 108 : 11 (IRVTE)
దేవా, నీవు మమ్మల్ని విడనాడావు గదా? దేవా, మా సేనలతో నీవు కూడా బయలుదేరడం చాలించుకున్నావు గదా? [QBR]
కీర్తనల గ్రంథము 108 : 12 (IRVTE)
మనుష్యుల సహాయం వ్యర్థం. శత్రువులను జయించడానికి నీవు మాకు సహాయం చెయ్యి. [QBR]
కీర్తనల గ్రంథము 108 : 13 (IRVTE)
దేవుని వలన మేము శూరకార్యాలు జరిగిస్తాము. మా శత్రువులను అణగదొక్కేవాడు ఆయనే. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: