కీర్తనల గ్రంథము 11 : 1 (IRVTE)
నేను యెహోవాలో ఆశ్రయం కోరాను. పక్షిలాగా కొండల్లోకి ఎగిరిపో, అని నువ్వు నా ప్రాణంతో ఎందుకు చెబుతావు? [QBR]
కీర్తనల గ్రంథము 11 : 2 (IRVTE)
ఎందుకంటే, చూడు! దుర్మార్గులు విల్లెక్కుపెట్టి ఉన్నారు. చీకటిలో యథార్థహృదయుల మీద వెయ్యడానికి తమ బాణాలు వింటి నారికి తగిలించి సిద్ధంగా ఉన్నారు. [QBR]
కీర్తనల గ్రంథము 11 : 3 (IRVTE)
పునాదులు పాడైపోతే న్యాయవంతులు ఏం చెయ్యగలరు? [QBR]
కీర్తనల గ్రంథము 11 : 4 (IRVTE)
యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. ఆయన కళ్ళు గమనిస్తున్నాయి. ఆయన కళ్ళు మనుషులను పరిశీలన చేస్తున్నాయి. [QBR]
కీర్తనల గ్రంథము 11 : 5 (IRVTE)
యెహోవా న్యాయవంతులనూ, దుర్మార్గులనూ, ఇద్దరినీ పరిశీలన చేస్తున్నాడు. హింసించడం పనిగా పెట్టుకున్న వాళ్ళను ఆయన ద్వేషిస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 11 : 6 (IRVTE)
దుర్మార్గుల మీద ఆయన రగులుతున్న నిప్పు కణికెలు, అగ్నిగంధకం కురిపిస్తాడు. ఆయన గిన్నెలోని వడగాలి వాళ్ళ పానీయభాగం అవుతుంది. [QBR]
కీర్తనల గ్రంథము 11 : 7 (IRVTE)
ఎందుకంటే యెహోవా న్యాయవంతుడు. ఆయన నీతిన్యాయాలను ప్రేమిస్తాడు. నిజాయితీపరులు ఆయన ముఖం చూస్తారు. [PE]

1 2 3 4 5 6 7

BG:

Opacity:

Color:


Size:


Font: