కీర్తనల గ్రంథము 110 : 1 (IRVTE)
యెహోవా నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. నేను నీ శత్రువులను నీ పాదాలకు పీఠంగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో. [QBR]
కీర్తనల గ్రంథము 110 : 2 (IRVTE)
యెహోవా అంటున్నాడు, సీయోనులోనుండి నీ పరిపాలన దండాన్ని చాపు. నీ శత్రువులపై పరిపాలన చెయ్యి. [QBR]
కీర్తనల గ్రంథము 110 : 3 (IRVTE)
నీవు నీ వైభవాన్ని ప్రదర్శించేటప్పుడు నీ ప్రజలు ఇష్టపూర్వకంగా నీతో వస్తారు. అరుణోదయ గర్భంలో నుండి కురిసే మంచులాగా నీ యవ్వనం ఉంటుంది. [QBR]
కీర్తనల గ్రంథము 110 : 4 (IRVTE)
మెల్కీసెదెకు [* మెల్కీసెదెకు చూడండిఃహెబ్రీ 5:6, 6:20, 7:17-21] క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడవై ఉంటావు, అని యెహోవా ప్రమాణం చేశాడు. ఆయన మాట తప్పనివాడు. [QBR]
కీర్తనల గ్రంథము 110 : 5 (IRVTE)
ప్రభువు నీ కుడిచేతి వైపున ఉండి తన కోపదినాన రాజులను హతమారుస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 110 : 6 (IRVTE)
అన్యజాతులకు ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన లోయలను శవాలతో నింపుతాడు. అనేక దేశాల నేతలను ఆయన హతమారుస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 110 : 7 (IRVTE)
దారిలో ఏటి నీళ్లు పానం చేస్తాడు. విజయగర్వంతో తన తల పైకెత్తుతాడు. [PE]

1 2 3 4 5 6 7

BG:

Opacity:

Color:


Size:


Font: