కీర్తనల గ్రంథము 111 : 1 (IRVTE)
యెహోవాను స్తుతించండి. యథార్థవంతుల సభలో, సమాజంలో పూర్ణ హృదయంతో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 111 : 2 (IRVTE)
యెహోవా క్రియలు గొప్పవి. వాటిని ఇష్టపడేవారంతా వాటిని తలపోస్తారు. [QBR]
కీర్తనల గ్రంథము 111 : 3 (IRVTE)
ఆయన పనులు మహిమా ప్రభావాలు గలవి. ఆయన నీతి నిత్యం నిలకడగా ఉంటుంది. [QBR]
కీర్తనల గ్రంథము 111 : 4 (IRVTE)
ఆయన తన ఆశ్చర్యకార్యాలకు జ్ఞాపకార్థ సూచన నియమించాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. [QBR]
కీర్తనల గ్రంథము 111 : 5 (IRVTE)
తన పట్ల భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చాడు. ఆయన నిత్యం తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. [QBR]
కీర్తనల గ్రంథము 111 : 6 (IRVTE)
ఆయన తన ప్రజలకు అన్యజాతుల ఆస్తిపాస్తులను అప్పగించాడు. తన క్రియల మహాత్మ్యాన్ని వారికి వెల్లడి చేశాడు. [QBR]
కీర్తనల గ్రంథము 111 : 7 (IRVTE)
ఆయన పనులు సత్యమైనవి, న్యాయమైనవి. ఆయన శాసనాలన్నీ నమ్మదగినవి. [QBR]
కీర్తనల గ్రంథము 111 : 8 (IRVTE)
అవి శాశ్వతంగా స్థాపించబడి ఉన్నాయి. సత్యంతో, యథార్థతతో అవి తయారైనాయి. [QBR]
కీర్తనల గ్రంథము 111 : 9 (IRVTE)
ఆయన తన ప్రజలకు విమోచన కలగజేసేవాడు. తన నిబంధన ఆయన శాశ్వతంగా ఉండాలని ఆదేశించాడు. ఆయన నామం పవిత్రం, పూజ్యం. [QBR]
కీర్తనల గ్రంథము 111 : 10 (IRVTE)
యెహోవా పట్ల భయం జ్ఞానానికి మూలం. ఆయన శాసనాలను అనుసరించేవారంతా మంచి వివేకం గలవారు. ఆయనకు నిత్యం స్తోత్రం. [PE]

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: