కీర్తనల గ్రంథము 113 : 1 (IRVTE)
యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి. యెహోవా నామాన్ని స్తుతించండి.
కీర్తనల గ్రంథము 113 : 2 (IRVTE)
ఇప్పుడు, ఎల్లకాలం యెహోవా నామానికి సన్నుతి.
కీర్తనల గ్రంథము 113 : 3 (IRVTE)
సూర్యోదయం మొదలు సూర్యాస్తమయం వరకూ యెహోవా నామం స్తుతినొందదగినది.
కీర్తనల గ్రంథము 113 : 4 (IRVTE)
యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు. ఆయన మహిమ ఆకాశాన్ని అంటుతున్నది.
కీర్తనల గ్రంథము 113 : 5 (IRVTE)
ఉన్నత స్థలంలో ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినవాడెవడు?
కీర్తనల గ్రంథము 113 : 6 (IRVTE)
ఆయన భూమినీ ఆకాశాన్నీ వంగి చూస్తున్నాడు.
కీర్తనల గ్రంథము 113 : 7 (IRVTE)
ఆయన దుమ్ములోనుండి దరిద్రులను లేవనెత్తుతాడు. బూడిద కుప్ప మీద నుండి పేదలను పైకెత్తుతాడు.
కీర్తనల గ్రంథము 113 : 8 (IRVTE)
ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చోబెట్టడం కోసం ఆయన ఇలా చేస్తాడు.
కీర్తనల గ్రంథము 113 : 9 (IRVTE)
ఆయన పిల్లలు లేని దాన్ని ఇల్లాలుగా చేస్తాడు. ఆమెకు పిల్లల తల్లిగా సంతోషం కలగజేస్తాడు. యెహోవాను స్తుతించండి.

1 2 3 4 5 6 7 8 9