కీర్తనల గ్రంథము 114 : 1 (IRVTE)
ఈజిప్టులోనుండి ఇశ్రాయేలు, విదేశీ జాతుల్లోనుండి యాకోబు వెళ్లిపోయినప్పుడు,
కీర్తనల గ్రంథము 114 : 2 (IRVTE)
యూదా ఆయనకు పరిశుద్ధస్థలం అయింది. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యం అయింది.
కీర్తనల గ్రంథము 114 : 3 (IRVTE)
సముద్రం దాన్ని చూసి పారిపోయింది. యొర్దాను నది వెనక్కి మళ్ళింది.
కీర్తనల గ్రంథము 114 : 4 (IRVTE)
పర్వతాలు పొట్టేళ్లలాగా, కొండలు గొర్రెపిల్లల్లాగా గంతులు వేశాయి.
కీర్తనల గ్రంథము 114 : 5 (IRVTE)
ఓ సముద్రం, పారిపోయావేమిటి? యొర్దానూ, నీవు వెనక్కి మళ్లావేమిటి?
కీర్తనల గ్రంథము 114 : 6 (IRVTE)
పర్వతాల్లారా, మీరు పొట్లేళ్లలాగానూ కొండల్లారా, మీరు గొర్రెపిల్లల్లాగానూ కుప్పిగంతులు వేశారెందుకు?
కీర్తనల గ్రంథము 114 : 7 (IRVTE)
భూమీ, ప్రభువు సన్నిధిలో, యాకోబు దేవుని సన్నిధిలో వణకు.
కీర్తనల గ్రంథము 114 : 8 (IRVTE)
ఆయన బండరాతిని నీటిమడుగుగా, చెకుముకి రాతి శిలను నీటి ఊటలుగా చేశాడు.

1 2 3 4 5 6 7 8