కీర్తనల గ్రంథము 115 : 1 (IRVTE)
దావీదు కీర్తన మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ నిబంధన విశ్వాస్యత, అధారపడ దగిన నీ గుణాన్ని బట్టి నీ నామానికే మహిమ కలుగు గాక.
కీర్తనల గ్రంథము 115 : 2 (IRVTE)
వారి దేవుడు ఎక్కడ, అని అన్యజాతులు ఎందుకు చెప్పుకుంటున్నారు?
కీర్తనల గ్రంథము 115 : 3 (IRVTE)
మా దేవుడు ఆకాశంలో ఉన్నాడు. తన ఇష్టప్రకారం సమస్తాన్నీ ఆయన చేస్తున్నాడు
కీర్తనల గ్రంథము 115 : 4 (IRVTE)
వారి విగ్రహాలు వెండి బంగారువి. అవి మనుష్యుల చేతిపనులు.
కీర్తనల గ్రంథము 115 : 5 (IRVTE)
వాటికి నోరుండి కూడా పలకవు. కళ్ళుండి కూడా చూడవు.
కీర్తనల గ్రంథము 115 : 6 (IRVTE)
చెవులుండి కూడా వినవు. ముక్కులుండి కూడా వాసన చూడవు.
కీర్తనల గ్రంథము 115 : 7 (IRVTE)
చేతులుండి కూడా ముట్టుకోవు. పాదాలుండి కూడా నడవవు. గొంతుకతో మాటలాడవు.
కీర్తనల గ్రంథము 115 : 8 (IRVTE)
వాటిని చేసే వారు, వాటిపై నమ్మిక ఉంచే వారు వాటివంటి వారే.
కీర్తనల గ్రంథము 115 : 9 (IRVTE)
ఇశ్రాయేలీయులారా, యెహోవాపై నమ్మకం ఉంచండి. ఆయన వారికి సహాయం, వారికి కవచం.
కీర్తనల గ్రంథము 115 : 10 (IRVTE)
అహరోను వంశస్థులారా, యెహోవాపై నమ్మకం ఉంచండి. ఆయన వారికి సహాయం, వారి కవచం.
కీర్తనల గ్రంథము 115 : 11 (IRVTE)
యెహోవా పట్ల భయభక్తులున్న వారంతా యెహోవాపై నమ్మిక ఉంచండి. ఆయన వారికి సహాయం, వారికి డాలు.
కీర్తనల గ్రంథము 115 : 12 (IRVTE)
యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదిస్తాడు. అహరోను వంశస్థులనాశీర్వదిస్తాడు.
కీర్తనల గ్రంథము 115 : 13 (IRVTE)
పిన్నలనేమి, పెద్దలనేమి తన పట్ల భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదిస్తాడు.
కీర్తనల గ్రంథము 115 : 14 (IRVTE)
యెహోవా మిమ్మల్ని, మీ పిల్లలను వృద్ధి పొందిస్తాడు.
కీర్తనల గ్రంథము 115 : 15 (IRVTE)
భూమ్యాకాశాలను సృష్టించిన యెహోవా చేత మీరు దీవెన పొందారు.
కీర్తనల గ్రంథము 115 : 16 (IRVTE)
ఆకాశాలు యెహోవా వశం. భూమిని ఆయన మనుషులకు ఇచ్చాడు.
కీర్తనల గ్రంథము 115 : 17 (IRVTE)
మృతులు, మౌనస్థితిలోకి దిగిపోయే వారు యెహోవాను స్తుతించరు.
కీర్తనల గ్రంథము 115 : 18 (IRVTE)
మేమైతే ఇప్పటినుండి నిత్యం యెహోవాను స్తుతిస్తాము. యెహోవాను స్తుతించండి.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18