కీర్తనల గ్రంథము 118 : 1 (IRVTE)
యెహోవా దయాళుడు. ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలిచి ఉంటుంది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.
కీర్తనల గ్రంథము 118 : 2 (IRVTE)
ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని ఇశ్రాయేలీయులు అందురు గాక.
కీర్తనల గ్రంథము 118 : 3 (IRVTE)
ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని అహరోను వంశస్థులు అందురు గాక.
కీర్తనల గ్రంథము 118 : 4 (IRVTE)
ఆయన నిబంధన విశ్వాస్యత నిరంతరం నిలుస్తుందని యెహోవాపై భయభక్తులు గలవారు అందురు గాక.
కీర్తనల గ్రంథము 118 : 5 (IRVTE)
ఇరుకైనచోట ఉండి నేను యెహోవాకు మొర్రపెట్టాను. విశాలస్థలంలో యెహోవా నాకు జవాబిచ్చాడు.
కీర్తనల గ్రంథము 118 : 6 (IRVTE)
యెహోవా నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను. మనుషులు నాకేమి చేయగలరు?
కీర్తనల గ్రంథము 118 : 7 (IRVTE)
యెహోవా నా పక్షం వహించి నాకు సహకారిగా ఉన్నాడు. నా శత్రువుల విషయంలో నా కోరిక నెరవేరడం నేను చూస్తాను.
కీర్తనల గ్రంథము 118 : 8 (IRVTE)
మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.
కీర్తనల గ్రంథము 118 : 9 (IRVTE)
రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు.
కీర్తనల గ్రంథము 118 : 10 (IRVTE)
అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను.
కీర్తనల గ్రంథము 118 : 11 (IRVTE)
నలుదెసలా వారు నన్ను చుట్టుముట్టి ఉన్నారు. యెహోవా నామాన్నిబట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను.
కీర్తనల గ్రంథము 118 : 12 (IRVTE)
కందిరీగల్లాగా వారు నా మీద ముసురుకున్నారు. ముళ్ళ పొదల మంట ఆరిపోయినట్టు వారు నశించిపోయారు. యెహోవా నామాన్ని బట్టి నేను వారిని నిర్మూలం చేస్తాను.
కీర్తనల గ్రంథము 118 : 13 (IRVTE)
వారు నాపై దాడి చేసి పడదోశారు. కానీ యెహోవా నాకు సహాయం చేశాడు.
కీర్తనల గ్రంథము 118 : 14 (IRVTE)
యెహోవా నా బలం, నా గానం. ఆయనే నా రక్షణాధారం.
కీర్తనల గ్రంథము 118 : 15 (IRVTE)
నీతిమంతుల గుడారాల్లో జయజయధ్వానాలు వినిపిస్తాయి. యెహోవా కుడి చెయ్యి విజయం సాధిస్తుంది.
కీర్తనల గ్రంథము 118 : 16 (IRVTE)
యెహోవా కుడి చెయ్యి మహోన్నతం అయింది. యెహోవా దక్షిణహస్తం విజయం సాధిస్తుంది.
కీర్తనల గ్రంథము 118 : 17 (IRVTE)
నేను చావను. బ్రతికి ఉంటాను. యెహోవా క్రియలు వర్ణిస్తాను.
కీర్తనల గ్రంథము 118 : 18 (IRVTE)
యెహోవా నన్ను కఠినంగా శిక్షించాడు గానీ ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు.
కీర్తనల గ్రంథము 118 : 19 (IRVTE)
నేను ప్రవేశించేలా నీతి ద్వారాలు తెరవండి, ఎక్కడ దేవుని ప్రజలు ప్రవేశిస్తారో. నేను ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తాను.
కీర్తనల గ్రంథము 118 : 20 (IRVTE)
ఇది యెహోవా ద్వారం. నీతిమంతులు దీనిలో ప్రవేశిస్తారు.
కీర్తనల గ్రంథము 118 : 21 (IRVTE)
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే నేను పిలిస్తే పలికావు. నాకు రక్షణాధారం అయ్యావు.
కీర్తనల గ్రంథము 118 : 22 (IRVTE)
ఇల్లు కట్టేవారు తిరస్కరించిన రాయి మూలరాయి అయింది.
కీర్తనల గ్రంథము 118 : 23 (IRVTE)
ఇది యెహోవా మూలంగా జరిగింది. ఇది మన దృష్టికి అబ్బురం.
కీర్తనల గ్రంథము 118 : 24 (IRVTE)
ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. దీనిలో మనం ఉప్పొంగిపోతూ ఆనందించుదాము.
కీర్తనల గ్రంథము 118 : 25 (IRVTE)
యెహోవా, దయచేసి నన్ను రక్షించు. యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించు.
కీర్తనల గ్రంథము 118 : 26 (IRVTE)
యెహోవా పేరట వచ్చేవాడికి ఆశీర్వాదం కలుగు గాక. యెహోవా మందిరంలోనుండి మిమ్మల్ని దీవిస్తున్నాము.
కీర్తనల గ్రంథము 118 : 27 (IRVTE)
యెహోవాయే దేవుడు. ఆయన మనకు వెలుగు అనుగ్రహించాడు. ఉత్సవ బలిపశువును తాళ్లతో బలిపీఠం కొమ్ములకు కట్టండి.
కీర్తనల గ్రంథము 118 : 28 (IRVTE)
నువ్వు నా దేవుడివి. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నువ్వు నా దేవుడివి. నిన్ను ఘనపరుస్తాను.
కీర్తనల గ్రంథము 118 : 29 (IRVTE)
యెహోవా దయాళుడు. ఆహా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నిబంధన విశ్వాస్యత శాశ్వతకాలం నిలిచి ఉంది.
❮
❯