కీర్తనల గ్రంథము 122 : 1 (IRVTE)
దావీదు రాసిన యాత్రల కీర్తన పదండి, యెహోవా మందిరానికి వెళ్దాం, అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను.
కీర్తనల గ్రంథము 122 : 2 (IRVTE)
యెరూషలేమా, మా పాదాలు నీ ప్రవేశ ద్వారాల వద్ద నిలబడుతున్నాయి.
కీర్తనల గ్రంథము 122 : 3 (IRVTE)
యెరూషలేమును కుదురైన నగరంగా కట్టారు.
కీర్తనల గ్రంథము 122 : 4 (IRVTE)
యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కిపోవాలని వారికి శాసనం ఉంది.
కీర్తనల గ్రంథము 122 : 5 (IRVTE)
నాయకులు అక్కడ సింహాసనాలపై కూర్చుంటారు. అవి దావీదు రాజవంశం సింహాసనాలు.
కీర్తనల గ్రంథము 122 : 6 (IRVTE)
యెరూషలేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవాళ్ళు వృద్ది చెందుతారు.
కీర్తనల గ్రంథము 122 : 7 (IRVTE)
నీ సరిహద్దులు ప్రశాంతంగా ఉండాలి. నీ పట్టణాల్లో శాంతి వర్ధిల్లుతూ ఉండాలి.
కీర్తనల గ్రంథము 122 : 8 (IRVTE)
మీకు శాంతి సమాధానాలు కలుగుతాయి, అని నా సహోదరులను, నా స్నేహితులను దీవిస్తాను.
కీర్తనల గ్రంథము 122 : 9 (IRVTE)
మన దేవుడైన యెహోవా మందిరం కోసం, నీకు మేలు కలగడం కోసం ప్రార్థన చేస్తాను.
❮
❯