కీర్తనల గ్రంథము 122 : 1 (IRVTE)
పదండి, యెహోవా మందిరానికి వెళ్దాం, అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను. [QBR]
కీర్తనల గ్రంథము 122 : 2 (IRVTE)
యెరూషలేమా, మా పాదాలు నీ ప్రవేశ ద్వారాల వద్ద నిలబడుతున్నాయి. [QBR]
కీర్తనల గ్రంథము 122 : 3 (IRVTE)
యెరూషలేమును కుదురైన నగరంగా కట్టారు. [QBR]
కీర్తనల గ్రంథము 122 : 4 (IRVTE)
యెహోవా నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కిపోవాలని వారికి శాసనం ఉంది. [QBR]
కీర్తనల గ్రంథము 122 : 5 (IRVTE)
నాయకులు అక్కడ సింహాసనాలపై కూర్చుంటారు. అవి దావీదు రాజవంశం సింహాసనాలు. [QBR]
కీర్తనల గ్రంథము 122 : 6 (IRVTE)
యెరూషలేము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవాళ్ళు వృద్ది చెందుతారు. [QBR]
కీర్తనల గ్రంథము 122 : 7 (IRVTE)
నీ సరిహద్దులు ప్రశాంతంగా ఉండాలి. నీ పట్టణాల్లో శాంతి వర్ధిల్లుతూ ఉండాలి. [QBR]
కీర్తనల గ్రంథము 122 : 8 (IRVTE)
మీకు శాంతి సమాధానాలు కలుగుతాయి, అని నా సహోదరులను, నా స్నేహితులను దీవిస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 122 : 9 (IRVTE)
మన దేవుడైన యెహోవా మందిరం కోసం, నీకు మేలు కలగడం కోసం ప్రార్థన చేస్తాను. [PE]

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: