కీర్తనల గ్రంథము 124 : 1 (IRVTE)
దావీదు రాసిన యాత్రల కీర్తన ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా చెప్పాలి. యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,
కీర్తనల గ్రంథము 124 : 2 (IRVTE)
మనుషులు మన మీదికి ఎగబడినప్పుడు, యెహోవా మనకు తోడుగా ఉండకపోతే,
కీర్తనల గ్రంథము 124 : 3 (IRVTE)
వాళ్ళ ఆగ్రహజ్వాలలు మనపై రగులుకున్నప్పుడు వాళ్ళు మనలను ప్రాణాలతోనే దిగమింగి ఉండేవాళ్ళు.
కీర్తనల గ్రంథము 124 : 4 (IRVTE)
నీళ్ళు మనలను కొట్టుకుపోయేలా చేసి ఉండేవి. ప్రవాహాలు మనలను ముంచెత్తి ఉండేవి.
కీర్తనల గ్రంథము 124 : 5 (IRVTE)
జల ప్రవాహాల పొంగు మనలను ఉక్కిరిబిక్కిరి చేసి ఉండేవి.
కీర్తనల గ్రంథము 124 : 6 (IRVTE)
వారి పళ్ళు మనలను చీల్చివేయకుండా కాపాడిన యెహోవాకు స్తుతి.
కీర్తనల గ్రంథము 124 : 7 (IRVTE)
వేటగాడి ఉరి నుండి పక్షి తప్పించుకొన్నట్టు మన ప్రాణం తప్పించుకుంది. ఉరి తెగిపోయింది. మనం తప్పించుకున్నాము.
కీర్తనల గ్రంథము 124 : 8 (IRVTE)
భూమినీ, ఆకాశాలనూ సృష్టించిన యెహోవాయే మనకు సహాయం.

1 2 3 4 5 6 7 8