కీర్తనల గ్రంథము 129 : 1 (IRVTE)
ఇశ్రాయేలు ఇలా చెప్పాలి. నా యవ్వన ప్రాయం నుంచి శత్రువులు నాపై దాడి చేశారు. [QBR]
కీర్తనల గ్రంథము 129 : 2 (IRVTE)
నా బాల్యం నుండి నాపై యుద్ధం చేస్తూ వచ్చారు. అయినా వాళ్ళు నన్ను ఓడించలేకపోయారు. [QBR]
కీర్తనల గ్రంథము 129 : 3 (IRVTE)
భూమిని దున్నినట్టు వాళ్ళు నా వీపును దున్నారు. నాకు నాగటి చాళ్ళవంటి గాయాలు చేశారు. [QBR]
కీర్తనల గ్రంథము 129 : 4 (IRVTE)
యెహోవా న్యాయవంతుడు. దుర్మార్గుల తాళ్ళను ఆయన తెంపివేశాడు. [QBR]
కీర్తనల గ్రంథము 129 : 5 (IRVTE)
సీయోనును ద్వేషించే వాళ్ళంతా సిగ్గుపడి, వెనుకడుగు వేస్తారు గాక. [QBR]
కీర్తనల గ్రంథము 129 : 6 (IRVTE)
వాళ్ళు ఇంటికప్పుపై మొలకెత్తే గడ్డిమొక్కలవలె ఉంటారు గాక. అవి ఎదిగీ ఎదగక ముందే వాడిపోతాయి. [QBR]
కీర్తనల గ్రంథము 129 : 7 (IRVTE)
కోసేవాడి గుప్పిలిలోకైనా ఆ గడ్డి చాలదు. పనలు కట్టేవాడు దానితో తన ఒడిని నింపుకోడానికి అది చాలదు. [QBR]
కీర్తనల గ్రంథము 129 : 8 (IRVTE)
ఆ దారిన పోయే వాళ్ళు, యెహోవా దీవెన మీపై ఉండు గాక, యెహోవా నామంలో మిమ్మల్ని దీవిస్తున్నాము అనరు గాక. [PE]

1 2 3 4 5 6 7 8

BG:

Opacity:

Color:


Size:


Font: