కీర్తనల గ్రంథము 13 : 1 (IRVTE)
ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన. యెహోవా, ఎంతకాలం నన్ను మరచిపోతూ ఉంటావు? ఎంతకాలం ముఖం దాచుకుంటావు?
కీర్తనల గ్రంథము 13 : 2 (IRVTE)
ఎంతకాలం నా మనస్సులో నేను ఆందోళన చెందాలి? ఎంతకాలం నా హృదయంలో పగలంతా నేను దుఃఖపడాలి? ఎంతకాలం నా శత్రువుకు నా మీద పైచెయ్యి అవుతుంది?
కీర్తనల గ్రంథము 13 : 3 (IRVTE)
యెహోవా నా దేవా, నాపై చూపు నిలిపి నాకు జవాబివ్వు. నా కళ్ళు వెలిగించు, లేకపోతే నేను నిద్రలోనే చనిపోతాను.
కీర్తనల గ్రంథము 13 : 4 (IRVTE)
నేను అతన్ని ఓడించాను, అని చెప్పే అవకాశం నా శత్రువుకు ఇవ్వకు. నా ప్రత్యర్ధి మీద నేను జయం పొందాను, అని నా శత్రువు అనకూడదు. అలా జరగకపోతే, నేను పడిపోయినప్పుడు నా శత్రువులు ఆనందిస్తారు.
కీర్తనల గ్రంథము 13 : 5 (IRVTE)
నేనైతే నీ నిబంధన నమ్మకత్వాన్ని ఆధారం చేసుకున్నాను. నీ రక్షణలో నా హృదయం ఆనందిస్తూ ఉంది.
కీర్తనల గ్రంథము 13 : 6 (IRVTE)
యెహోవా నన్ను మేళ్ళతో నింపాడు గనక నేను ఆయనకు కీర్తన పాడతాను.

1 2 3 4 5 6