కీర్తనల గ్రంథము 132 : 1 (IRVTE)
యాత్రల కీర్తన యెహోవా, దావీదుకు దాపురించిన బాధలన్నిటినీ అతడి తరపున జ్ఞాపకం చేసుకో.
కీర్తనల గ్రంథము 132 : 2 (IRVTE)
అతడు ఏ విధంగా యెహోవాకు ప్రమాణం చేశాడో, పరాక్రమశాలి అయిన యాకోబు దేవుడికి ఏమి వాగ్దానం చేశాడో మనసుకు తెచ్చుకో.
కీర్తనల గ్రంథము 132 : 3 (IRVTE)
(3-5)నేను యెహోవా కోసం ఒక స్థలం చూసే దాకా, యాకోబు పరాక్రమశాలికి ఒక నివాస స్థలం సమకూర్చేదాకా నా ఇంట్లో అడుగు పెట్టను. నా కళ్ళకు నిద్ర, నా కనురెప్పలకు విశ్రాంతి రానివ్వను.
కీర్తనల గ్రంథము 132 : 4 (IRVTE)
కీర్తనల గ్రంథము 132 : 5 (IRVTE)
కీర్తనల గ్రంథము 132 : 6 (IRVTE)
ఆ స్థలం ఎఫ్రాతాలో ఉన్నట్టు విన్నాం. యాయరు పొలంలో అది దొరికింది.
కీర్తనల గ్రంథము 132 : 7 (IRVTE)
యెహోవా మందిరానికి వెళ్దాం పదండి. రండి, ఆయన పాదపీఠం ఎదుట సాష్టాంగపడదాం.
కీర్తనల గ్రంథము 132 : 8 (IRVTE)
యెహోవా, లే. నీ విశ్రాంతి స్థలానికి రా.
కీర్తనల గ్రంథము 132 : 9 (IRVTE)
నీ యాజకులు న్యాయాన్ని ధరించుకుంటారు గాక. నీ భక్తులు జయజయ ధ్వానాలు చేస్తారు గాక.
కీర్తనల గ్రంథము 132 : 10 (IRVTE)
నీ సేవకుడైన దావీదు మొహం చూసి నీ అభిషిక్తునికి విముఖత చూపించకు.
కీర్తనల గ్రంథము 132 : 11 (IRVTE)
నీ సంతానాన్ని నీ సింహాసనానికి శాశ్వత వారసులుగా చేస్తాను అనీ, దావీదు పట్ల నమ్మకంగా ఉంటాననీ ఆయన శపథం చేశాడు.
కీర్తనల గ్రంథము 132 : 12 (IRVTE)
నీ కొడుకులు నా నిబంధన పాటిస్తే నేను నేర్పిన నా శాసనాలు అనుసరిస్తే ఇలా జరుగుతుంది, అన్నాడు.
కీర్తనల గ్రంథము 132 : 13 (IRVTE)
తప్పనిసరిగా యెహోవా సీయోనును ఎన్నుకున్నాడు. దాన్ని తన నివాసస్థలంగా కోరుకున్నాడు.
కీర్తనల గ్రంథము 132 : 14 (IRVTE)
ఇది నేను కోరుకున్న స్థలం. ఇది శాశ్వతంగా నా విశ్రాంతి స్థలంగా ఉంటుంది. ఇక్కడే నేను నివసిస్తాను.
కీర్తనల గ్రంథము 132 : 15 (IRVTE)
దానిలో ఆహారం సమృద్ధిగా ఉండేలా దీవిస్తాను. దానిలోని పేదలను చాలినంత ఆహారంతో తృప్తి పరుస్తాను.
కీర్తనల గ్రంథము 132 : 16 (IRVTE)
దాని యాజకులకు రక్షణ ధరింపజేస్తాను. దానిలో భక్తులు ఎలుగెత్తి హర్ష ధ్వానాలు చేస్తారు.
కీర్తనల గ్రంథము 132 : 17 (IRVTE)
అక్కడే దావీదు వంశానికి చిగురు మొలకెత్తేలా చేస్తాను. అక్కడే నా అభిషిక్తుని కోసం నేను ఒక దీపం సిద్ధం చేసి ఉంచాను.
కీర్తనల గ్రంథము 132 : 18 (IRVTE)
అతని శత్రువులు అవమానం ధరించుకునేలా చేస్తాను. అతని కిరీటం మాత్రం ప్రకాశిస్తుంది.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18