కీర్తనల గ్రంథము 14 : 1 (IRVTE)
దేవుడు లేడు, అని బుద్ధిలేని వాడు తన మనసులో అనుకుంటాడు. వాళ్ళు చెడిపోయిన వాళ్ళు, అసహ్యమైన పాపం చేసిన వాళ్ళు. మంచి చేసేవాడు ఎవడూ లేడు. [QBR]
కీర్తనల గ్రంథము 14 : 2 (IRVTE)
వివేకం కలిగి దేవుణ్ణి వెదికే వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని యెహోవా ఆకాశం నుంచి మనుషులను చూస్తున్నాడు. [QBR]
కీర్తనల గ్రంథము 14 : 3 (IRVTE)
ప్రతిఒక్కడూ దారి తొలగిపోయాడు. వారంతా రోతగా ఉన్నారు. మంచి చేసేవాడు ఒక్కడూ లేడు, ఒక్కడైనా లేడు. [QBR]
కీర్తనల గ్రంథము 14 : 4 (IRVTE)
యెహోవాకు ప్రార్థన చెయ్యకుండా ఆహారం మింగినట్టు నా ప్రజలను మింగుతూ పాపం చేసేవాళ్ళందరికీ తెలివి లేదా? [QBR]
కీర్తనల గ్రంథము 14 : 5 (IRVTE)
వాళ్ళు భయంతో వణికిపోతారు. ఎందుకంటే దేవుడు న్యాయవంతుల సభతో ఉన్నాడు. [QBR]
కీర్తనల గ్రంథము 14 : 6 (IRVTE)
యెహోవా అతనికి ఆశ్రయంగా ఉన్నా, ఆ పేదవాణ్ణి నువ్వు అవమానించాలని చూస్తున్నావు. [QBR]
కీర్తనల గ్రంథము 14 : 7 (IRVTE)
సీయోనులోనుంచి ఇశ్రాయేలుకు రక్షణ కలుగు గాక! యెహోవా చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబులో ఆనందం, ఇశ్రాయేలులో సంతోషం కలుగుతుంది. [PE]

1 2 3 4 5 6 7

BG:

Opacity:

Color:


Size:


Font: