కీర్తనల గ్రంథము 140 : 1 (IRVTE)
ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన యెహోవా, దుష్టుల బారి నుండి నన్ను విడిపించు. దుర్మార్గుల చేతుల్లో పడకుండా నన్ను కాపాడు.
కీర్తనల గ్రంథము 140 : 2 (IRVTE)
వాళ్ళు తమ హృదయాల్లో ప్రమాదకరమైన తలంపులు పెట్టుకుంటారు. అన్నివేళలా కలహాలు పుట్టించాలని ఎదురు చూస్తుంటారు.
కీర్తనల గ్రంథము 140 : 3 (IRVTE)
వాళ్ళు పాము నాలుకలాగా తమ నాలుకలు పదును చేసుకుంటారు. వారి పెదాల కింద పాము విషం ఉంచుకుంటారు. QSS సెలా.SE
కీర్తనల గ్రంథము 140 : 4 (IRVTE)
యెహోవా, దుర్మార్గుల బారిన పడకుండా నన్ను కాపాడు. దౌర్జన్యపరుల చేతిలోనుండి నన్ను రక్షించు. నన్ను పడగొట్టడానికి వాళ్ళు పథకాలు వేస్తున్నారు.
కీర్తనల గ్రంథము 140 : 5 (IRVTE)
గర్వాంధులు నాకోసం బోను పెట్టారు. వాళ్ళు దారి పక్కన వల పరిచారు. నన్ను బంధించడానికి ఉచ్చులు పన్నారు. QSS సెలా. SE
కీర్తనల గ్రంథము 140 : 6 (IRVTE)
అయితే నేను యెహోవాతో ఇలా మనవి చేసుకుంటున్నాను, యెహోవా, నా దేవుడివి నువ్వే. నా విన్నపాలు ఆలకించు.
కీర్తనల గ్రంథము 140 : 7 (IRVTE)
యెహోవా ప్రభూ, నువ్వే నాకు ఆశ్రయమిచ్చే కోట. యుద్ధ సమయంలో నా తలకు కాపు కాసే వాడివి నువ్వే.
కీర్తనల గ్రంథము 140 : 8 (IRVTE)
యెహోవా, భక్తిహీనుల కోరికలను నేరవేర్చకు. వాళ్ళు మిడిసిపడకుండేలా వాళ్ళ పథకాలు భగ్నం చెయ్యి. QSS సెలా. SE
కీర్తనల గ్రంథము 140 : 9 (IRVTE)
నా చుట్టూ మూగిన వాళ్ళ తల మీదికి వాళ్ళ మాటల ద్వారా కీడు కలుగు గాక.
కీర్తనల గ్రంథము 140 : 10 (IRVTE)
కణకణలాడే నిప్పులు వాళ్ళపై కురియాలి. వాళ్ళను అగ్నిగుండంలో పడవెయ్యి. ఎన్నటికీ లేవకుండా అగాధంలో పడవెయ్యి.
కీర్తనల గ్రంథము 140 : 11 (IRVTE)
దూషకులకు భూమి మీద భద్రత లేకుండా పోవాలి. దుర్మార్గులను ఆపదలు వెంటాడి పడగొట్టాలి.
కీర్తనల గ్రంథము 140 : 12 (IRVTE)
బాధితుల తరపున యెహోవా వాదిస్తాడనీ. ఆయన దరిద్రులకు న్యాయం చేకూరుస్తాడని నాకు తెలుసు.
కీర్తనల గ్రంథము 140 : 13 (IRVTE)
నీతిపరులు నీ నామానికి కచ్చితంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. యథార్థవర్తనులు నీ సన్నిధిలో నివసిస్తారు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13