కీర్తనల గ్రంథము 143 : 1 (IRVTE)
దావీదు కీర్తన యెహోవా, నా ప్రార్థన విను. నా విన్నపాలు అంగీకరించు. నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ న్యాయాన్ని బట్టి నాకు జవాబివ్వు.
కీర్తనల గ్రంథము 143 : 2 (IRVTE)
నీ సేవకుణ్ణి విచారణలోకి రప్పించకు. ఎందుకంటే ఏ ఒక్కడూ నీ సమక్షంలో నీతిమంతుడు కాదు.
కీర్తనల గ్రంథము 143 : 3 (IRVTE)
నా శత్రువు నన్ను వెంబడిస్తున్నాడు. నన్ను నేలకేసి తొక్కిపెట్టాడు. ఎప్పుడో చనిపోయిన వాళ్ళతో బాటు నన్ను కూడా పాతాళంలో ఉండిపోయేలా చేయాలని చూస్తున్నాడు.
కీర్తనల గ్రంథము 143 : 4 (IRVTE)
నా హృదయం నాలో నిరాశకులోనైంది. నా ఆత్మ నాలో క్షీణించిపోయింది.
కీర్తనల గ్రంథము 143 : 5 (IRVTE)
పాత రోజులను గుర్తు చేసుకుంటున్నాను. నీ పనులన్నీ మననం చేసుకుంటున్నాను. నువ్వు సాధించిన వాటిని తలపోసుకుంటున్నాను.
కీర్తనల గ్రంథము 143 : 6 (IRVTE)
నీ వైపు నా చేతులు ఆశగా చాపుతున్నాను. ఎండి నెర్రెలు విచ్చిన నేలలాగా నా ప్రాణం నీ కోసం ఆశపడుతూ ఉంది. QSS సెలా. SE
కీర్తనల గ్రంథము 143 : 7 (IRVTE)
యెహోవా, నా ఆత్మ సోలిపోయింది. త్వరగా నాకు జవాబియ్యి. నీ ముఖం దాచుకోవద్దు. అలా చేస్తే నేను సమాధిలోకి దిగిపోయినవాడిలాగా అవుతాను.
కీర్తనల గ్రంథము 143 : 8 (IRVTE)
నీపై నేను నమ్మకం పెట్టుకున్నాను. తెల్లవారగానే నువ్వు చూపే నిబంధన విశ్వసనీయత సమాచారం వినిపించు. నా మనసును నీ వైపే ఎత్తి ఉన్నాను. నేను ఎలా నడుచుకోవాలో నాకు నేర్పించు.
కీర్తనల గ్రంథము 143 : 9 (IRVTE)
యెహోవా, నా శత్రువుల చేతిలోనుండి నన్ను విడిపించు. నీ అండనే కోరుతున్నాను.
కీర్తనల గ్రంథము 143 : 10 (IRVTE)
నీ చిత్తం ప్రకారం నడుచుకోవడం నాకు నేర్పించు. నా దేవుడివి నువ్వే. నీ ఆత్మ ద్వారా యథార్థత నివసించే ప్రదేశంలో నన్ను నడిపించు.
కీర్తనల గ్రంథము 143 : 11 (IRVTE)
యెహోవా, నీ నామం నిమిత్తం నన్ను బ్రతికించు. నీ న్యాయాన్ని బట్టి నన్ను బాధల్లో నుండి తప్పించు.
కీర్తనల గ్రంథము 143 : 12 (IRVTE)
నేను నీ సేవకుణ్ణి. నీ నిబంధన విశ్వసనీయతను బట్టి నా విరోధులను లేకుండా చెయ్యి. నా శత్రువులందరినీ నాశనం చెయ్యి.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12