కీర్తనల గ్రంథము 16 : 1 (IRVTE)
దేవా, నీ ఆశ్రయం కోరాను, నన్ను కాపాడు. [QBR]
కీర్తనల గ్రంథము 16 : 2 (IRVTE)
నేను యెహోవాతో అంటాను. నువ్వు నా ప్రభువు. నీకు వేరుగా నాకు ఏ మంచీ లేదు. [QBR]
కీర్తనల గ్రంథము 16 : 3 (IRVTE)
భూమి మీద ఉన్న భక్తుల విషయానికి వస్తే, వాళ్ళు శ్రేష్టులు. నా ఆనందం అంతా వాళ్ళే. [QBR]
కీర్తనల గ్రంథము 16 : 4 (IRVTE)
యెహోవాను విడిచి ఇతర దేవుళ్ళను ఆశించే వాళ్లకు సమస్యలు ఎక్కువౌతాయి. వాళ్ళు అర్పించే రక్తపానీయ అర్పణలు నేను అర్పించను. నా పెదాలతో వాళ్ళ పేర్లు ఎత్తను. [QBR]
కీర్తనల గ్రంథము 16 : 5 (IRVTE)
యెహోవా, నాకు వారసత్వంగా వచ్చిన వాటా నువ్వే. నువ్వే నా గిన్నె. నా అంతిమ గమ్యం నీ చేతుల్లోనే ఉంది. [QBR]
కీర్తనల గ్రంథము 16 : 6 (IRVTE)
మనోహరమైన స్థలాల్లో నాకోసం హద్దులు గీసి ఉన్నాయి. కచ్చితంగా శ్రేష్ఠమైన స్వాస్థ్యం నాది. [QBR]
కీర్తనల గ్రంథము 16 : 7 (IRVTE)
నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతిస్తాను, రాత్రివేళల్లో కూడా నా మనసు నాకు ఉపదేశిస్తూ ఉంది. [QBR]
కీర్తనల గ్రంథము 16 : 8 (IRVTE)
అన్నివేళలా యెహోవా వైపు నేను చూస్తూ ఉంటాను, ఆయన కుడిచేతిలోనుంచి నేను కదిలిపోను! [QBR]
కీర్తనల గ్రంథము 16 : 9 (IRVTE)
అందువల్ల నా హృదయం సంతోషంగా ఉంది. నా పూర్ణ హృదయం ఆయనను పొగడుతూ ఉంది. కచ్చితంగా నేను సురక్షితంగా ఉంటాను. [QBR]
కీర్తనల గ్రంథము 16 : 10 (IRVTE)
ఎందుకంటే నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచి పెట్టవు. నిబంధన నమ్మకత్వం ఉన్నవాణ్ణి చావు చూడనివ్వవు. [QBR]
కీర్తనల గ్రంథము 16 : 11 (IRVTE)
జీవమార్గం నువ్వు నాకు తెలియజేస్తావు. నీ సన్నిధిలో మహానందం ఉంది. నీ కుడిచేతిలో నిత్యానందం ఉంది. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: