కీర్తనల గ్రంథము 17 : 1 (IRVTE)
దావీదు ప్రార్థన. యెహోవా, న్యాయం కోసం నేను చేసే అభ్యర్ధన ఆలకించు, నా మొర పట్ల శ్రద్ధ చూపించు, కపటం లేని నా పెదాలనుంచి వచ్చే ప్రార్థన నీకు వినిపించనివ్వు.
కీర్తనల గ్రంథము 17 : 2 (IRVTE)
నేను నిర్దోషినన్న రుజువు నీ సన్నిధినుంచి రానియ్యి. న్యాయమైనదేదో దాన్ని నీ కళ్ళు చూడనియ్యి.
కీర్తనల గ్రంథము 17 : 3 (IRVTE)
రాత్రివేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయాన్ని పరీక్షిస్తే, నువ్వు నన్ను శుద్ధి చేస్తావు, నాలో ఏ దుష్ట ప్రణాళికలూ నీకు కనబడవు. నా నోరు అతిక్రమించి మాట్లాడదు.
కీర్తనల గ్రంథము 17 : 4 (IRVTE)
మనుషుల చేతల విషయమైతే, నీ నోటి మాటనుబట్టి అరాచకుల మార్గాలనుంచి నన్ను నేను దూరంగా ఉంచుకున్నాను.
కీర్తనల గ్రంథము 17 : 5 (IRVTE)
నీ అడుగుజాడల్లో నా అడుగులు స్థిరంగా ఉన్నాయి. నా కాళ్ళు జారలేదు.
కీర్తనల గ్రంథము 17 : 6 (IRVTE)
నేను నీకు నివేదన చేశాను. ఎందుకంటే నువ్వు నాకు జవాబిస్తావు. దేవా, నేను నీతో మాట్లాడినప్పుడు నా మాట నీ చెవిన పడనివ్వు.
కీర్తనల గ్రంథము 17 : 7 (IRVTE)
శత్రువుల బారి నుంచి రక్షణ కోసం నీలో ఆశ్రయం పొందిన వాళ్ళను నీ కుడిచేతితో రక్షించేవాడా, నీ నిబంధన నమ్మకత్వాన్ని అద్భుతంగా నాకు కనపరుచు.
కీర్తనల గ్రంథము 17 : 8 (IRVTE)
నీ కంటి పాపను కాపాడినట్టు నన్ను కాపాడు. నీ రెక్కల నీడలో నన్ను దాచిపెట్టు.
కీర్తనల గ్రంథము 17 : 9 (IRVTE)
నా మీద దాడి చేసే దుర్మార్గులనుంచి, నన్ను చుట్టుముట్టిన నా శత్రువులనుంచి నన్ను కాపాడు.
కీర్తనల గ్రంథము 17 : 10 (IRVTE)
వాళ్లకు ఎవరిమీదా దయ లేదు. వాళ్ళ నోళ్ళు గర్వంతో మాట్లాడుతున్నాయి.
కీర్తనల గ్రంథము 17 : 11 (IRVTE)
నా అడుగులను వాళ్ళు చుట్టుముట్టారు. నన్ను దెబ్బతీసి నేలకూల్చడానికి కనిపెడుతున్నారు.
కీర్తనల గ్రంథము 17 : 12 (IRVTE)
వాళ్ళు వేటకు ఆతురతతో ఉన్న సింహంలా ఉన్నారు. చాటైన స్థలాల్లో పొంచి ఉన్న సింహం కూనలాగా ఉన్నారు.
కీర్తనల గ్రంథము 17 : 13 (IRVTE)
యెహోవా లేచి రా! వాళ్ళ మీద పడు! వాళ్ళ ముఖాలు నేలకు కొట్టు! నీ ఖడ్గంతో దుర్మార్గులనుంచి నా ప్రాణం రక్షించు.
కీర్తనల గ్రంథము 17 : 14 (IRVTE)
నీ చేతితో మనుషుల బారినుండి, యెహోవా, ఈ జీవితకాలంలో మాత్రమే సంపదలు ఉన్న ఈ లోకసంబంధుల నుంచి నన్ను రక్షించు. నువ్వు అపురూపంగా ఎంచిన నీ వాళ్ళ కడుపులు నిధులతో నింపుతావు. వాళ్ళు బహుసంతానం కలిగి తమ ఆస్తిని తమ పిల్లలకు సంక్రమింపజేస్తారు.
కీర్తనల గ్రంథము 17 : 15 (IRVTE)
నేనైతే న్యాయవంతుడిగా నీ ముఖం చూస్తాను. నేను మేల్కొన్నప్పుడు నీ సుదర్శనం చూసి నేను తృప్తి పొందుతాను.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15