కీర్తనల గ్రంథము 20 : 1 (IRVTE)
ఆపద సమయంలో యెహోవా నీకు జవాబిస్తాడు గాక. యాకోబు దేవుని నామం నిన్ను కాపాడుతుంది గాక. [QBR]
కీర్తనల గ్రంథము 20 : 2 (IRVTE)
పరిశుద్ధ స్థలంలోనుంచి ఆయన నీకు సహాయం చేస్తాడు గాక. సీయోనులోనుంచి నిన్ను ఆదుకుంటాడు గాక. [QBR]
కీర్తనల గ్రంథము 20 : 3 (IRVTE)
ఆయన నీ అర్పణలు జ్ఞాపకం చేసుకుని, నీ దహన బలులు అంగీకరిస్తాడు గాక. [QBR]
కీర్తనల గ్రంథము 20 : 4 (IRVTE)
నీ హృదయవాంఛను తీర్చి నీ ప్రణాళికలన్నీ నెరవేరుస్తాడు గాక. [QBR]
కీర్తనల గ్రంథము 20 : 5 (IRVTE)
అప్పుడు నీ రక్షణను బట్టి మేము ఆనందిస్తాము. దేవా, నీ పేరట జెండా ఎత్తుతాము. నీ అభ్యర్ధనలన్నీ యెహోవా మంజూరు చేస్తాడు గాక. [QBR]
కీర్తనల గ్రంథము 20 : 6 (IRVTE)
యెహోవా తన అభిషిక్తుణ్ణి రక్షిస్తాడని నాకిప్పుడు తెలిసింది. రక్షించగల తన కుడిచేతి బలంతో తన పవిత్రాకాశంలోనుంచి అతనికి జవాబిస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 20 : 7 (IRVTE)
కొందరు రథాలను, కొందరు గుర్రాలను నమ్ముకుంటారు. కాని మనం మన దేవుడైన యెహోవాకు మొర పెడతాము. [QBR]
కీర్తనల గ్రంథము 20 : 8 (IRVTE)
వాళ్ళు కుంగి నేల మీద పడిపోతారు, మనం లేచి తిన్నగా నిలిచి ఉంటాము! [QBR]
కీర్తనల గ్రంథము 20 : 9 (IRVTE)
యెహోవా, రాజును రక్షించు. మేము మొరపెట్టినప్పుడు మాకు సహాయం చెయ్యి. [PE]

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: