కీర్తనల గ్రంథము 24 : 1 (IRVTE)
భూమి, దానిలో ఉన్నవన్నీ యెహోవావే. లోకం, దాని నివాసులందరూ ఆయనకు చెందినవారే. [QBR]
కీర్తనల గ్రంథము 24 : 2 (IRVTE)
ఎందుకంటే ఆయన సముద్రాల మీద దానికి పునాది వేశాడు. నదుల మీద దాన్ని ఏర్పరిచాడు. [QBR]
కీర్తనల గ్రంథము 24 : 3 (IRVTE)
యెహోవా పర్వతం ఎక్కే అర్హత ఎవరికుంది? ఆయన పవిత్ర స్థలంలో ఎవరు ప్రవేశించగలరు [* ప్రవేశించగలరు నిలబడగలరు] ? [QBR]
కీర్తనల గ్రంథము 24 : 4 (IRVTE)
అసత్యంపై మనసు పెట్టకుండా, మోసపూరితంగా ఒట్టు పెట్టుకోకుండా, నిర్దోషమైన చేతులూ, శుద్ధమైన హృదయం కలిగినవాడే. [QBR]
కీర్తనల గ్రంథము 24 : 5 (IRVTE)
అతడు యెహోవా వల్ల ఆశీర్వాదం పొందుతాడు, తన రక్షకుడైన దేవుని వల్ల నిర్దోషత్వం పొందుతాడు. [QBR]
కీర్తనల గ్రంథము 24 : 6 (IRVTE)
ఆయనను కోరుకున్న తరం, యాకోబు దేవుని సన్నిధిని కోరుకున్నవాళ్ళు అలాంటివాళ్ళే. సెలా.
కీర్తనల గ్రంథము 24 : 7 (IRVTE)
మహిమ కలిగిన రాజు లోపలి వచ్చేలా, ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి. శాశ్వతమైన తలుపులారా, తెరుచుకోండి. [QBR]
కీర్తనల గ్రంథము 24 : 8 (IRVTE)
మహిమగల ఈ రాజు ఎవరు? బలశౌర్యాలు కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. [QBR]
కీర్తనల గ్రంథము 24 : 9 (IRVTE)
మహిమగల రాజు లోపలికి వచ్చేలా ద్వారాల్లారా, మీ తలలు ఎత్తండి. శాశ్వతమైన తలుపులారా, తెరుచుకోండి. [QBR]
కీర్తనల గ్రంథము 24 : 10 (IRVTE)
మహిమగల ఈ రాజు ఎవరు? దూతల సైన్యాలకు అధిపతి యెహోవాయే. ఆయనే ఈ మహిమగల రాజు. సెలా. [PE]

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: