కీర్తనల గ్రంథము 25 : 1 (IRVTE)
దావీదు కీర్తన. యెహోవా, నీ కోసం నా ప్రాణం పైకెత్తుతున్నాను.
కీర్తనల గ్రంథము 25 : 2 (IRVTE)
నా దేవా, నీలో నా నమ్మకం ఉంచాను. నన్ను సిగ్గుపడనివ్వకు. నా మీద నా శత్రువులకు జయోత్సాహం కలగనివ్వకు.
కీర్తనల గ్రంథము 25 : 3 (IRVTE)
నీ కోసం నమ్మకంతో ఎదురు చూసే వాళ్ళు ఎవ్వరూ అవమానం పొందరు. అకారణంగా ద్రోహం చేసే వాళ్ళే సిగ్గు పడతారు.
కీర్తనల గ్రంథము 25 : 4 (IRVTE)
యెహోవా, నీ మార్గాలు నాకు తెలియజెయ్యి. నీ త్రోవలు నాకు నేర్పించు.
కీర్తనల గ్రంథము 25 : 5 (IRVTE)
నీ సత్యంలోకి నన్ను నడిపించి నాకు బోధించు, ఎందుకంటే నువ్వే నా రక్షణకర్తవైన దేవుడివి. రోజంతా నేను నీ కోసం కనిపెడతాను.
కీర్తనల గ్రంథము 25 : 6 (IRVTE)
యెహోవా, నీ కరుణతో, నిబంధన నమ్మకత్వంతో నువ్వు చేసిన పనులు గుర్తు చేసుకో. ఎందుకంటే అవి ఎప్పుడూ నిలిచి ఉన్నాయి.
కీర్తనల గ్రంథము 25 : 7 (IRVTE)
బాల్యంలో నేను చేసిన పాపాలు, నా తిరుగుబాటుతనం గుర్తు చేసుకోవద్దు. యెహోవా, నీ మంచితనంతో, నీ నిబంధన నమ్మకత్వంతో నన్ను గుర్తు చేసుకో.
కీర్తనల గ్రంథము 25 : 8 (IRVTE)
యెహోవా మంచివాడు, ఆయన న్యాయవంతుడు. కాబట్టి పాపులకు తన మార్గం బోధిస్తాడు.
కీర్తనల గ్రంథము 25 : 9 (IRVTE)
దీనులను న్యాయంగా నడిపిస్తాడు, దీనులకు తన మార్గం బోధిస్తాడు.
కీర్తనల గ్రంథము 25 : 10 (IRVTE)
ఆయన చేసిన నిబంధన, ఆయన నియమించిన శాసనాలు పాటించిన వాళ్లకు యెహోవా త్రోవలన్నీ నిబంధన నమ్మకత్వంతోనూ, విశ్వసనీయతతోనూ నిర్మాణం అయ్యాయి.
కీర్తనల గ్రంథము 25 : 11 (IRVTE)
యెహోవా, నీ నామాన్నిబట్టి నా పాపం క్షమించు. ఎందుకంటే అది చాలా ఘోరం.
కీర్తనల గ్రంథము 25 : 12 (IRVTE)
యెహోవా పట్ల భయభక్తులు కలిగినవాడు ఎవరు? అతడు కోరుకోవలసిన మార్గం ఆయన అతనికి నిర్దేశిస్తాడు.
కీర్తనల గ్రంథము 25 : 13 (IRVTE)
అతని ప్రాణం సంతోషంగా ఉంటుంది. అతని సంతానం దేశానికి వారసులవుతారు.
కీర్తనల గ్రంథము 25 : 14 (IRVTE)
ఆయనపట్ల భయభక్తులు గల వారికి యెహోవా ఆలోచన తెలుస్తుంది, ఆయన తన నిబంధన వాళ్లకు తెలియజేస్తాడు.
కీర్తనల గ్రంథము 25 : 15 (IRVTE)
నా కళ్ళు ఎప్పుడూ యెహోవా మీదే ఉన్నాయి, ఎందుకంటే ఆయన నా పాదాలను వలలోనుంచి విడిపిస్తాడు.
కీర్తనల గ్రంథము 25 : 16 (IRVTE)
నా వైపు తిరిగి నన్ను కరుణించు, ఎందుకంటే నేను ఒంటరివాణ్ణి, బాధ పొందినవాణ్ణి.
కీర్తనల గ్రంథము 25 : 17 (IRVTE)
నా హృదయవేదనలు అతి విస్తారం. అమితమైన బాధ నుంచి నన్ను బయటకు లాగు.
కీర్తనల గ్రంథము 25 : 18 (IRVTE)
నా బాధ, నా కష్టం చూడు. నా పాపాలన్నీ క్షమించు.
కీర్తనల గ్రంథము 25 : 19 (IRVTE)
నా శత్రువులను చూడు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. క్రూరమైన ద్వేషంతో వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారు.
కీర్తనల గ్రంథము 25 : 20 (IRVTE)
నా ప్రాణం కాపాడి నన్ను రక్షించు. నేను సిగ్గుపడను. ఎందుకంటే నేను నీ ఆశ్రయం కోరుతున్నాను.
కీర్తనల గ్రంథము 25 : 21 (IRVTE)
నీ కోసం నేను కనిపెడుతున్నాను గనక యథార్థత, నిర్దోషత్వం నన్ను సంరక్షిస్తాయి గాక.
కీర్తనల గ్రంథము 25 : 22 (IRVTE)
దేవా, తన బాధలన్నిటిలో నుంచి ఇశ్రాయేలును రక్షించు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22