కీర్తనల గ్రంథము 26 : 1 (IRVTE)
దావీదు కీర్తన. యెహోవా, నేను నిజాయితీగా నడుచుకున్నాను. నాకు న్యాయం తీర్చు. ఊగిసలాడకుండా యెహోవాలో నా నమ్మకం ఉంచాను.
కీర్తనల గ్రంథము 26 : 2 (IRVTE)
యెహోవా, నన్ను పరిశీలించు. నన్ను పరీక్షించు. నా అంతరంగంలో, నా హృదయంలో ఉన్న స్వచ్ఛతను పరీక్షించు.
కీర్తనల గ్రంథము 26 : 3 (IRVTE)
నీ నిబంధన నమ్మకత్వం నా కళ్ళెదుట ఉంది. నీ సత్యంలో నేను నడుచుకుంటున్నాను.
కీర్తనల గ్రంథము 26 : 4 (IRVTE)
మోసగాళ్లతో నేను సాంగత్యం చెయ్యను. నిజాయితీ లేని వాళ్ళతో నేను కలిసి ఉండను.
కీర్తనల గ్రంథము 26 : 5 (IRVTE)
దుష్టుల గుంపు నాకు అసహ్యం, దుర్మార్గులతో నేను సహవాసం చెయ్యను.
కీర్తనల గ్రంథము 26 : 6 (IRVTE)
నేను నిర్దోషిగా నా చేతులు కడుక్కుంటాను. యెహోవా, నేను నీ బలిపీఠం వైపు తిరుగుతాను.
కీర్తనల గ్రంథము 26 : 7 (IRVTE)
అక్కడ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తాను.
కీర్తనల గ్రంథము 26 : 8 (IRVTE)
నీ మహిమ నిలిచే స్థలం, యెహోవా, నువ్వు నివాసం ఉంటున్న నీ ఇల్లు నాకెంతో ఇష్టం.
కీర్తనల గ్రంథము 26 : 9 (IRVTE)
పాపులతో పాటు నా ప్రాణం, క్రూరులతో పాటు నా జీవం ఊడ్చి వేయకు.
కీర్తనల గ్రంథము 26 : 10 (IRVTE)
వాళ్ళ చేతుల్లో ఒక కుట్ర ఉంది. వాళ్ళ కుడిచెయ్యి లంచాలతో నిండి ఉంది.
కీర్తనల గ్రంథము 26 : 11 (IRVTE)
కాని నా వరకైతే నేను నిజాయితీగా నడుచుకుంటాను. నన్ను విమోచించి నన్ను కరుణించు.
కీర్తనల గ్రంథము 26 : 12 (IRVTE)
చదునైన చోట నా పాదం నిలిపాను. సభలలో నేను యెహోవాను స్తుతిస్తాను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12