కీర్తనల గ్రంథము 3 : 1 (IRVTE)
యెహోవా, నాకు శత్రువులు ఎంతోమంది! చాలా మంది నా మీద దాడి చేశారు. [QBR]
కీర్తనల గ్రంథము 3 : 2 (IRVTE)
దేవుని నుంచి అతనికి ఏ సహాయమూ లేదు అని ఎందరో నా గురించి అంటున్నారు. సెలా.
కీర్తనల గ్రంథము 3 : 3 (IRVTE)
కాని యెహోవా, నువ్వే నాకు డాలు, నువ్వే నాకు మహిమ, నా తల ఎత్తేవాడివి. [QBR]
కీర్తనల గ్రంథము 3 : 4 (IRVTE)
నేను యెహోవాకు నా స్వరమెత్తినప్పుడు, ఆయన తన పవిత్ర పర్వతం నుండి నాకు జవాబిస్తాడు. సెలా.
కీర్తనల గ్రంథము 3 : 5 (IRVTE)
నేను పడుకుని నిద్రపోయాను. యెహోవా నాకు క్షేమం ఇచ్చాడు గనక మేల్కొన్నాను. [QBR]
కీర్తనల గ్రంథము 3 : 6 (IRVTE)
అన్ని వైపులనుంచి వచ్చి నాకు విరోధంగా మొహరించిన గుంపులకు నేను భయపడను. [QBR]
కీర్తనల గ్రంథము 3 : 7 (IRVTE)
యెహోవా, లేచి రా. నా దేవా, నన్ను రక్షించు. నువ్వు నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొడతావు. దుర్మార్గుల పళ్లు విరగ్గొడతావు. [QBR]
కీర్తనల గ్రంథము 3 : 8 (IRVTE)
రక్షణ [* రక్షణ విజయం] యెహోవా నుంచి వస్తుంది. నీ ప్రజల మీద నీ ఆశీర్వాదం ఉండు గాక. సెలా. [PE]

1 2 3 4 5 6 7 8

BG:

Opacity:

Color:


Size:


Font: