కీర్తనల గ్రంథము 34 : 1 (IRVTE)
అన్ని సమయాల్లో నేను యెహోవాను స్తుతిస్తాను. నా నోట్లో నిత్యమూ ఆయన స్తుతి ఉంటుంది. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 2 (IRVTE)
నేను యెహోవాను స్తుతిస్తాను. అణచివేతకు గురైన వాళ్ళు అది విని సంతోషిస్తారు గాక! [QBR]
కీర్తనల గ్రంథము 34 : 3 (IRVTE)
నాతో కలసి యెహోవాను ప్రశంసించండి. మనం అందరం కలసి ఆయన నామాన్ని పైకెత్తుదాం. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 4 (IRVTE)
నేను యెహోవాకు విజ్ఞాపన చేశాను. ఆయన నాకు జవాబిచ్చాడు. నా భయాలన్నిటి మీదా నాకు విజయమిచ్చాడు. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 5 (IRVTE)
ఆయన వైపు చూసే వాళ్ళు ప్రకాశవంతంగా ఉంటారు. వాళ్ళ ముఖాల్లో అవమానం అన్నది కన్పించదు. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 6 (IRVTE)
అణచివేతకు గురైన ఈ వ్యక్తి విలపించాడు. దాన్ని యెహోవా విన్నాడు. సమస్యలన్నిటి నుండి అతణ్ణి రక్షించాడు. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 7 (IRVTE)
యెహోవా అంటే భయమూ భక్తీ ఉన్న వాళ్ళ చుట్టూ ఆయన దూత కాపలా ఉంటాడు. వాళ్ళను కాపాడుతూ ఉంటాడు. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 8 (IRVTE)
యెహోవా మంచివాడని అనుభవపూర్వకంగా తెలుసుకోండి. ఆయనలో శరణం పొందేవాడు ధన్యజీవి. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 9 (IRVTE)
యెహోవా ఎన్నుకున్న ప్రజలారా! ఆయన అంటే భయమూ, భక్తీ కలిగి ఉండండి. ఆయనంటే భయభక్తులు ఉన్నవాడికి ఎలాంటి కొరతా ఉండదు. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 10 (IRVTE)
సింహం పిల్లలు ఆహారం లేక ఆకలితో ఉంటాయి. కాని యెహోవాను సమీపించి ప్రార్ధించే వారికి అన్ని మేళ్లూ కలుగుతాయి. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 11 (IRVTE)
పిల్లలూ, రండి, నా మాటలు వినండి. యెహోవా అంటే భయభక్తులు నేను మీకు బోధిస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 12 (IRVTE)
జీవితాన్ని కాంక్షించేవాడు, ఎక్కువ కాలం జీవించాలని ఆశించే వాడు, చక్కని జీవితం కావాలి అనుకునేవాడు ఏం చేయాలి? [QBR]
కీర్తనల గ్రంథము 34 : 13 (IRVTE)
దుర్మార్గమైన మాటలు పలకకుండా ఉండు. అబద్ధాలు చెప్పకుండా నీ పెదాలను కాపాడుకో. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 14 (IRVTE)
చెడ్డవాటి నుండి మనస్సు మళ్ళించుకో. మంచి పనులు చెయ్యి. శాంతిని కోరుకో. శాంతినే వెంటాడు. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 15 (IRVTE)
యెహోవా కంటి చూపు ధర్మాత్ములపై ఉంది. ఆయన చెవులు వాళ్ళ ప్రార్థనలను వింటూ ఉన్నాయి. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 16 (IRVTE)
చెడు కార్యాలు చేసే వాళ్ళ జ్ఞాపకం భూమిపై ఉండకుండా చేయడానికి యెహోవా వాళ్లకు విరోధంగా ఉన్నాడు. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 17 (IRVTE)
ధర్మాత్ములు ప్రార్థించినప్పుడు యెహోవా వింటాడు. అన్ని సమస్యల నుండి వాళ్ళను విడిపిస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 18 (IRVTE)
విరిగిన హృదయం గల వాళ్లకు యెహోవా సమీపంగా ఉన్నాడు. నలిగిపోయిన మనస్సు గల వాళ్లను ఆయన రక్షిస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 19 (IRVTE)
ధర్మాత్ముడికి ఎన్నో ఆపదలు కలుగుతాయి. కానీ యెహోవా వాటన్నిటి పైనా అతనికి విజయం ఇస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 20 (IRVTE)
ఆయన అతని ఎముకలన్నిటినీ కాపాడుతాడు. వాటిలో ఒక్కటి కూడా విరిగి పోదు. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 21 (IRVTE)
చెడుతనం దుర్మార్గులను హతం చేస్తుంది. ధర్మాత్ముణ్ణి అసహ్యించుకునే వాడు శిక్ష పొందుతాడు. [QBR]
కీర్తనల గ్రంథము 34 : 22 (IRVTE)
యెహోవా తన సేవకుల ప్రాణాలను విడుదల చేస్తాడు. ఆయన శరణు వేడిన వాడికి శిక్ష ఉండదు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22

BG:

Opacity:

Color:


Size:


Font: