కీర్తనల గ్రంథము 35 : 1 (IRVTE)
దావీదు కీర్తన యెహోవా, నాకు విరోధంగా పనులు చేస్తున్న వారికి విరోధంగా ఉండు. నాతో పోరాటం చేసే వాళ్ళతో నువ్వు పోరాటం చెయ్యి.
కీర్తనల గ్రంథము 35 : 2 (IRVTE)
నీ చిన్న డాలునూ, నీ పెద్ద డాలునూ పట్టుకో. లేచి నాకు సహాయం చెయ్యి.
కీర్తనల గ్రంథము 35 : 3 (IRVTE)
నన్ను తరిమే వాళ్ళకు విరోధంగా ఈటెనూ, గొడ్డలినీ ప్రయోగించు. నీ రక్షణ నేనే అని నాకు అభయమివ్వు.
కీర్తనల గ్రంథము 35 : 4 (IRVTE)
నా ప్రాణం తీయాలని చూసేవాళ్ళు సిగ్గుపడి అవమానం పాలవుతారు గాక! నాకు హాని చేయాలని చూసే వాళ్ళు వెనక్కి తగ్గి గందరగోళానికి గురౌతారు గాక!
కీర్తనల గ్రంథము 35 : 5 (IRVTE)
యెహోవా దూత వాళ్ళను తరుముతుంటే వాళ్ళు వీస్తున్న గాలి ఎదుట ఎగిరిపోయే పొట్టులాగా ఉంటారు గాక!
కీర్తనల గ్రంథము 35 : 6 (IRVTE)
యెహోవా దూత వాళ్ళను తరుముతుంటే వాళ్ళు వెళ్ళే దారి చీకటిగానూ జారుడుగానూ ఉంటుంది గాక!
కీర్తనల గ్రంథము 35 : 7 (IRVTE)
కారణం లేకుండానే వాళ్ళు నన్ను పట్టుకోడానికి వల వేశారు. కారణం లేకుండానే వాళ్ళు నా ప్రాణం తీయాలని నా కోసం గుంట తవ్వారు.
కీర్తనల గ్రంథము 35 : 8 (IRVTE)
వాడి పైకి వాడికి తెలియకుండా వాణ్ణి విస్మయానికి గురి చేస్తూ నాశనం రానీ. వాళ్ళు వేసిన వలలో వాళ్ళనే పడనీ. తమ స్వనాశనం కోసం వాళ్ళనే దానిలో పడనీ.
కీర్తనల గ్రంథము 35 : 9 (IRVTE)
అయితే నేను యెహోవాలో ఆనందిస్తూ ఉంటాను. ఆయన ఇచ్చే రక్షణలో సంతోషిస్తూ ఉంటాను.
కీర్తనల గ్రంథము 35 : 10 (IRVTE)
అప్పుడు నా శక్తి అంతటితో నేనిలా అంటాను. యెహోవా, నువ్వు అణచివేతకు గురైన వాళ్ళను బలవంతుల చేతిలో నుండీ, పేదలనూ, అవసరార్థులనూ దోచుకునే వాళ్ళ చేతిలో నుండీ విడిపిస్తావు. నీలాటి వారెవరు?
కీర్తనల గ్రంథము 35 : 11 (IRVTE)
అధర్మపరులైన సాక్షులు బయల్దేరుతున్నారు. వాళ్ళు నాపై అసత్య నిందలు వేస్తున్నారు.
కీర్తనల గ్రంథము 35 : 12 (IRVTE)
నేను వాళ్లకు చేసిన మంచికి బదులుగా వాళ్ళు నాకు చెడు చేస్తున్నారు. నాకు విచారంగా ఉంది.
కీర్తనల గ్రంథము 35 : 13 (IRVTE)
అయితే వాళ్ళు వ్యాధితో ఉన్నప్పుడు నేను గోనె గుడ్డ ధరించాను. నా తల వాల్చి వాళ్ళ కోసం ఉపవాసం ఉన్నాను.
కీర్తనల గ్రంథము 35 : 14 (IRVTE)
అతడు నాకు సోదరుడైనట్టుగా వేదన పడ్డాను. నా తల్లి కోసం అయినట్టుగా కుంగిపోయాను.
కీర్తనల గ్రంథము 35 : 15 (IRVTE)
కాని నా అడుగులు తడబడినప్పుడు వాళ్ళంతా గుమికూడి సంతోషించారు. నాకు వ్యతిరేకంగా వాళ్ళంతా కలిశారు. కానీ నాకు ఆ సంగతి తెలియలేదు. ఆపకుండా అదే పనిగా వాళ్ళు నన్ను నిందించారు.
కీర్తనల గ్రంథము 35 : 16 (IRVTE)
గౌరవం ఏమీ లేకుండా వాళ్ళు నన్ను ఎత్తి పొడిచారు. నన్ను చూస్తూ పళ్ళు కొరికారు.
కీర్తనల గ్రంథము 35 : 17 (IRVTE)
ప్రభూ, నువ్వు ఇక ఎంతకాలం చూస్తూ ఉంటావు? నీవెన్నాళ్లు చూస్తూ ఊరకుంటావు? వాళ్ళ విధ్వంసకరమైన దాడుల నుండి నన్ను కాపాడు. సింహాల నుండి నా ప్రాణాన్ని రక్షించు.
కీర్తనల గ్రంథము 35 : 18 (IRVTE)
అప్పుడు నేను మహాసమాజంలో నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అనేకమంది జనాలున్న చోట నిన్ను స్తుతిస్తాను.
కీర్తనల గ్రంథము 35 : 19 (IRVTE)
నా విషయంలో నా శత్రువులు అన్యాయంగా సంతోష పడేలా చేయకు. వాళ్ళ దుర్మార్గపు ప్రణాళికలను అమలు చెయ్యనీయకు.
కీర్తనల గ్రంథము 35 : 20 (IRVTE)
వాళ్ళు శాంతిని గూర్చి మాట్లాడరు. దేశంలో ప్రశాంతంగా జీవిస్తున్న వాళ్లకు విరోధంగా మోసపూరితమైన మాటలు కల్పిస్తారు.
కీర్తనల గ్రంథము 35 : 21 (IRVTE)
నన్ను నిందించడానికి తమ నోళ్ళు బాగా తెరిచారు. ఆహా, మా కళ్ళకు వాడు చేసింది కనిపించిందిలే, అంటున్నారు.
కీర్తనల గ్రంథము 35 : 22 (IRVTE)
యెహోవా, నువ్వు చూస్తున్నావు. మౌనంగా ఉండకు. ప్రభూ, నాకు దూరంగా ఉండకు.
కీర్తనల గ్రంథము 35 : 23 (IRVTE)
నా దేవా, నా ప్రభూ, నా పక్షంగా వాదించడానికి లే. లేచి నాకు న్యాయం తీర్చు.
కీర్తనల గ్రంథము 35 : 24 (IRVTE)
యెహోవా, నా దేవా, నీ నీతిని బట్టి నా పక్షం వహించు. నా విషయంలో వాళ్ళను సంతోషపడనియ్యకు.
కీర్తనల గ్రంథము 35 : 25 (IRVTE)
వాళ్ళు తమ మనస్సుల్లో ఆహా, మేము కోరుకున్నట్టే జరిగింది అని చెప్పే అవకాశం ఇవ్వకు. మేము వాణ్ణి పూర్తిగా నాశనం చేశాం* పూర్తిగా నాశనం చేశాం మింగేశాం , అని చెప్పనివ్వకు.
కీర్తనల గ్రంథము 35 : 26 (IRVTE)
వాళ్ళను అవమానానికి గురి చెయ్యి. నాకు హాని తలపెట్టే వాళ్ళను చిందరవందర చెయ్యి. నాకు వ్యతిరేకంగా వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు అవమానానికీ, అగౌరవానికీ గురౌతారు గాక!
కీర్తనల గ్రంథము 35 : 27 (IRVTE)
నా నిర్దోషత్వం రుజువు కావాలని కోరుకునే వాళ్ళు ఆనందంతో కోలాహలం చేస్తూ సంతోషిస్తారు గాక! తన సేవకుడి సంక్షేమం చూసి ఆనందించే యెహోవాకు వాళ్ళు నిత్యం స్తుతులు చెల్లిస్తారు గాక!
కీర్తనల గ్రంథము 35 : 28 (IRVTE)
అప్పుడు నేను నీ న్యాయాన్ని గూర్చి ప్రచారం చేస్తాను. దినమంతా నిన్ను స్తుతిస్తూ ఉంటాను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28