కీర్తనల గ్రంథము 36 : 1 (IRVTE)
ప్రధాన సంగీతకారునికి యెహోవా సేవకుడు దావీదు కీర్తన దుర్మార్గుడి హృదయంలో పాపం దివ్యవాణిలాగా మాట్లాడుతూ ఉంది. వాడి కళ్ళల్లో దేవుడి భయం కన్పించడం లేదు.
కీర్తనల గ్రంథము 36 : 2 (IRVTE)
ఎందుకంటే వాడి పాపం బయటపడదనీ, దాన్ని ఎవరూ అసహ్యించుకోరనే భ్రమలో వాడు నివసిస్తున్నాడు.
కీర్తనల గ్రంథము 36 : 3 (IRVTE)
వాడు పలికే మాటలు పాప భూయిష్టంగా, మోసపూరితంగా ఉన్నాయి. వాడికి జ్ఞానంగా ప్రవర్తించడం, మంచి పనులు చేయడం ఇష్టం లేదు.
కీర్తనల గ్రంథము 36 : 4 (IRVTE)
వాడు మంచం దిగకుండానే పాపం ఎలా చేయాలా అని ఆలోచిస్తాడు. దుర్మార్గపు మార్గాలను ఎంచుకుని వెళ్తాడు. చెడును నిరాకరించడు.
కీర్తనల గ్రంథము 36 : 5 (IRVTE)
యెహోవా, నీ నిబంధన కృప ఆకాశాన్ని అంటుతుంది. నీ విశ్వసనీయత మేఘాలను తాకుతుంది.
కీర్తనల గ్రంథము 36 : 6 (IRVTE)
నీ న్యాయం ఉన్నతమైన పర్వతాలతో సమానం. నీ న్యాయం లోతైన సముద్రంతో సమానం. యెహోవా నువ్వు మానవులను, జంతువులను సంరక్షిస్తావు.
కీర్తనల గ్రంథము 36 : 7 (IRVTE)
దేవా, నీ నిబంధన కృప ఎంత ప్రశస్తమైనది! నీ రెక్కల నీడన మానవ జాతి ఆశ్రయం పొందుతుంది.
కీర్తనల గ్రంథము 36 : 8 (IRVTE)
నీ మందిరపు సమృద్ధి వలన వాళ్ళు సంపూర్ణ సంతృప్తి పొందుతున్నారు. నీ అమూల్యమైన దీవెనల జలధారలో వాళ్ళని తాగనిస్తావు.
కీర్తనల గ్రంథము 36 : 9 (IRVTE)
నీ దగ్గర జీవపు ఊట ఉంది. నీ వెలుగులోనే మేము వెలుగును చూస్తున్నాం.
కీర్తనల గ్రంథము 36 : 10 (IRVTE)
నువ్వంటే తెలిసినవారికి నీ నిబంధన కృపనూ, యథార్ధమైన హృదయం కలిగిన వాళ్లకు నీ కాపుదలనూ అధికంగా విస్తరింపజేయ్యి.
కీర్తనల గ్రంథము 36 : 11 (IRVTE)
అహంకారి పాదం నా సమీపంలోకి రానియ్యకు. దుర్మార్గుడి హస్తం నన్ను తరమనియ్యకు.
కీర్తనల గ్రంథము 36 : 12 (IRVTE)
అదుగో పాపం చేసే వాళ్ళు అక్కడే పడిపోయారు. ఇక లేచే సామర్ధ్యం లేకుండా కూలిపోయారు.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12