కీర్తనల గ్రంథము 39 : 1 (IRVTE)
ప్రధాన సంగీతకారుడు యెదూతూను కోసం. దావీదు కీర్తన ఇది నా నిర్ణయం, నా నాలుకతో పాపం చేయకుండా ఉండటానికి నా మాటలను జాగ్రత్తగా చూసుకుంటాను. దుర్మార్గుడి దగ్గర నా నోటికి కళ్ళెం పెట్టుకుంటాను.
కీర్తనల గ్రంథము 39 : 2 (IRVTE)
నేను మౌనంగా ఉన్నాను. మంచి సంగతులను కూడా పలకకుండా ఉన్నాను. నా వేదన అధికమైంది.
కీర్తనల గ్రంథము 39 : 3 (IRVTE)
నా గుండె నాలో రగులుతూ ఉంది. ఈ విషయాలను గూర్చి నేను ఆలోచిస్తూ ఉంటే అది ఇంకా అగ్నిలా మండుతున్నది. చివరకు నేను ఇలా అన్నాను.
కీర్తనల గ్రంథము 39 : 4 (IRVTE)
యెహోవా, నా జీవితం ఎప్పుడు అంతమౌతుందో నాకు తెలియజెయ్యి. నా జీవితంలో ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో తెలియజెయ్యి. నా జీవితం ఎంత క్షణ భంగురమో నేను తెలుసుకునేలా చెయ్యి.
కీర్తనల గ్రంథము 39 : 5 (IRVTE)
ఇదిగో, నువ్వు నా జీవితంలో రోజులను ఒక బెత్తెడంతగా చేశావు. నా జీవితకాలం నీ ఎదుట అసలు లేనట్టే ఉంది. ప్రతి మనిషీ నిశ్చయంగా కేవలం ఊపిరిలాగా ఉన్నాడు. QSS సెలా.SE
కీర్తనల గ్రంథము 39 : 6 (IRVTE)
నిశ్చయంగా ప్రతి మనిషీ నీడలా తిరుగుతూ ఉంటాడు. నిస్సందేహంగా మనుషులు సంపదలు సమకూర్చుకోవడానికి త్వరపడుతూ ఉంటారు, అవన్నీ చివరగా ఎవరికి దక్కుతాయో తెలియకపోయినా సరే.
కీర్తనల గ్రంథము 39 : 7 (IRVTE)
ప్రభూ, ఇప్పుడు నేను దేని కోసం వేచి ఉన్నాను? నాకున్న ఆధారం నువ్వే.
కీర్తనల గ్రంథము 39 : 8 (IRVTE)
నా పాపాలన్నిటిపైనా నాకు విజయం దయచెయ్యి. మూర్ఖులు అవమానించడానికి లక్ష్యంగా నన్ను చేయవద్దు.
కీర్తనల గ్రంథము 39 : 9 (IRVTE)
ఇదంతా నువ్వే జరిగించావు. నేను నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాను.
కీర్తనల గ్రంథము 39 : 10 (IRVTE)
నన్ను గాయపరచడం ఇక ఆపు. నీ చేతి దెబ్బ నన్ను అణచివేస్తుంది.
కీర్తనల గ్రంథము 39 : 11 (IRVTE)
పాపం కారణంగా నువ్వు మనుషులను శిక్షించినప్పుడు చెద పురుగులా వారి శక్తిని నువ్వు హరిస్తావు. నిశ్చయంగా మనుషులందరూ ఆవిరిలాంటి వాళ్ళు. QSS సెలా. SE
కీర్తనల గ్రంథము 39 : 12 (IRVTE)
యెహోవా, నా ప్రార్థన విను. నేను చెప్పేది విను. నా రోదనను పట్టించుకో. చెవిటివాడిలాగా ఉండకు. నీ ఎదుట నేను పరదేశిలా ఉన్నాను. నా పూర్వీకులందరిలాగ శరణార్ధిలాగా ఉన్నాను.
కీర్తనల గ్రంథము 39 : 13 (IRVTE)
నేను చనిపోయేముందు నేను సంతోషించేలా నా నుంచి నీ కోపపు చూపులు చాలించుకో.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13