కీర్తనల గ్రంథము 41 : 1 (IRVTE)
బలహీనులను పట్టించుకునే వాడు ధన్యజీవి. కష్ట సమయంలో యెహోవా అతణ్ణి కాపాడతాడు. [QBR]
కీర్తనల గ్రంథము 41 : 2 (IRVTE)
యెహోవా అతణ్ణి భద్రపరచి సజీవంగా ఉంచుతాడు. భూమి మీద అతణ్ణి ఆశీర్వదిస్తాడు. అతని శత్రువులు కోరుకున్నట్టుగా అతణ్ణి వాళ్ళకి స్వాధీనం చేయడు. [QBR]
కీర్తనల గ్రంథము 41 : 3 (IRVTE)
జబ్బు చేసి పడకపై ఉన్నప్పుడు యెహోవా అతణ్ణి పరామర్శిస్తాడు. వ్యాధి పడకను నువ్వు స్వస్థత పడకగా మారుస్తావు. [QBR]
కీర్తనల గ్రంథము 41 : 4 (IRVTE)
నేనిలా అన్నాను. యెహోవా, నీకు విరోధంగా నేను పాపం చేశాను. నన్ను కనికరించు. నా హృదయాన్ని బాగుచెయ్యి. [QBR]
కీర్తనల గ్రంథము 41 : 5 (IRVTE)
నా శత్రువులు నాకు వ్యతిరేకంగా చెడ్డ మాటలు అంటారు, వాడు ఎప్పుడు చచ్చిపోతాడు? వాడి పేరు ఎప్పుడు మాసిపోతుంది? అంటారు. [QBR]
కీర్తనల గ్రంథము 41 : 6 (IRVTE)
నా శత్రువు నన్ను చూడటానికి వస్తే నా గురించి పనికిమాలిన మాటలు చెప్తాడు. వాడి హృదయం నా నాశనం చూడ్డానికి సిద్ధపడి ఉంటుంది. వాడు బయటకు వెళ్లి ఇతరులకు ఆ సంగతి చెప్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 41 : 7 (IRVTE)
నన్ను ద్వేషించే వాళ్ళంతా చేరి నాకు వ్యతిరేకంగా గుసగుసలాడుతూ ఉన్నారు. నాకు గాయం కావాలని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు [* నాకు గాయం కావాలని వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు నాకు కీడు చేయాలని దురాలోచన చేస్తారు] . [QBR]
కీర్తనల గ్రంథము 41 : 8 (IRVTE)
ఒక చెడ్డ రోగం వాణ్ణి గట్టిగా పట్టుకుంది. ఇప్పుడు వాడు పడకపై ఉన్నాడు. దానిపైనుంచి వాడిక లేవడు అని చెప్పుకుంటారు. [QBR]
కీర్తనల గ్రంథము 41 : 9 (IRVTE)
నేను నమ్మిన నా సన్నిహిత మిత్రుడు, నా ఆహారం పంచుకున్నవాడు నన్ను తన్నడానికి కాలు ఎత్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 41 : 10 (IRVTE)
కానీ యెహోవా, వాళ్ళకు బదులు తీర్చడానికై నన్ను కరుణించి పైకి లేపు. [QBR]
కీర్తనల గ్రంథము 41 : 11 (IRVTE)
అప్పుడు నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుస్తుంది. నా శత్రువు నాపై విజయం సాధించలేడు. [QBR]
కీర్తనల గ్రంథము 41 : 12 (IRVTE)
నా యథార్థతను బట్టి నువ్వు నాకు సహాయం చేస్తావు. నీ సమక్షంలో నన్ను శాశ్వతంగా నిలబెట్టుకుంటావు. [QBR]
కీర్తనల గ్రంథము 41 : 13 (IRVTE)
నిత్యత్వం నుండి నిత్యత్వం వరకూ ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తుతి కలుగు గాక! ఆమేన్‌. ఆమేన్‌. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: