కీర్తనల గ్రంథము 44 : 1 (IRVTE)
దేవా, మా పూర్వీకుల రోజుల్లో, మా పితరుల కాలంలో నువ్వు చేసిన పనులన్నిటిని గూర్చి మా పితరులు మాకు చెప్పారు. మేము మా చెవులారా విన్నాం. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 2 (IRVTE)
నువ్వు నీ చేత్తో వివిధ జాతులను తోసివేశావు. మా ప్రజలను అక్కడ నాటావు. ప్రజలను బాధపెట్టావు. కానీ దేశంలో మా ప్రజలను విస్తరింపజేశావు. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 3 (IRVTE)
వాళ్ళు తమ చేతనున్న కత్తితో అక్కడి భూమిని తమ కోసం స్వాధీనం చేసుకోలేదు. వారి భుజబలం వారిని రక్షించలేదు. కానీ నీ కుడి చెయ్యి, నీ భుజబలం, నీ ముఖకాంతి వాళ్ళకి విజయం సాధించిపెట్టాయి. నువ్వు వాళ్ళకు అనుకూలంగా ఉన్నావు. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 4 (IRVTE)
దేవా, నువ్వే నాకు రాజువి. యాకోబుకు విజయం కలగాలని ఆజ్ఞాపించు. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 5 (IRVTE)
నీ ద్వారా మేము మా శత్రువులను అణచి వేస్తాం. నీ నామాన్ని బట్టి మేము మాపై లేచే వాళ్ళను తొక్కి వేస్తాం. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 6 (IRVTE)
నేను నా విల్లుపై భరోసా ఉంచను. నా కత్తి నన్ను రక్షించలేదు. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 7 (IRVTE)
మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడింది నువ్వే. మమ్మల్ని ద్వేషించే వాళ్ళను సిగ్గుపరిచిందీ నువ్వే. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 8 (IRVTE)
మా దేవునిలోనే మేము రోజంతా గర్విస్తున్నాం. నీ నామానికి శాశ్వతంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాం. సెలా.
కీర్తనల గ్రంథము 44 : 9 (IRVTE)
అయితే ఇప్పుడు నువ్వు మమ్మల్ని తోసివేశావు. మా పైకి అవమానం పంపించావు. మా సైన్యాలతో కలసి నువ్వు బయలుదేరడం లేదు. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 10 (IRVTE)
శత్రువుల ఎదుట నిలబడలేక వెనక్కి తిరిగేలా చేస్తున్నావు. మమ్మల్ని ద్వేషించేవాళ్ళు తమ కోసం మమ్మల్ని దోచుకుంటున్నారు. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 11 (IRVTE)
వాళ్ళ కోసం ఆహారంగా తయారైన గొర్రెల్లాగా మమ్మల్ని చేశావు. అనేక దేశాల్లోకి మమ్మల్ని చెదరగొట్టావు. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 12 (IRVTE)
అతి తక్కువ వెలకు మమ్మల్ని అమ్మివేశావు. అలా చేయడం మూలంగా నీ సంపద ఏమీ అధికం కాలేదు. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 13 (IRVTE)
మా పొరుగు వాళ్ళ దృష్టిలో మమ్మల్ని నిందకూ ఎగతాళికీ పరిహాసానికీ కారణంగా చేశావు. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 14 (IRVTE)
మా చుట్టూ ఉన్న దేశాల్లో మమ్మల్ని ఒక అవమానంగా, ప్రజలు తల ఊపి హేళన చేయడానికి కారణంగా చేశావు. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 15 (IRVTE)
పరిహాసం, అవమానం చేసే వాళ్ళ కారణంగా, పగ తీర్చుకునే శత్రువు కారణంగా [QBR]
కీర్తనల గ్రంథము 44 : 16 (IRVTE)
ఆ అవమానమే రోజంతా నా ఎదుట ఉంది. నా ముఖంలో కనిపించే అవమానం నన్ను నిలువెల్లా కప్పివేస్తున్నది. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 17 (IRVTE)
ఇదంతా మాకు జరిగినా మేము మాత్రం నిన్ను మర్చిపోలేదు. నీ నిబంధనను అతిక్రమించలేదు. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 18 (IRVTE)
మా హృదయం నిన్ను విడిచి వెనక్కి మళ్ళలేదు. మా అడుగులు నీ మార్గాన్ని విడువలేదు. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 19 (IRVTE)
కానీ నువ్వు నక్కలు తిరిగే చోట మమ్మల్ని తీవ్రంగా విరగ్గొట్టావు. చావునీడ కింద మమ్మల్ని కప్పి ఉంచావు. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 20 (IRVTE)
ఒకవేళ మేము మా దేవుడి నామాన్ని మర్చిపోయి అన్య దేవతల వైపు మా చెయ్యి చాపితే [QBR]
కీర్తనల గ్రంథము 44 : 21 (IRVTE)
హృదయ రహస్యాలు తెలిసిన దేవుడు ఇది తెలుసుకోకుండా ఉంటాడా? [QBR]
కీర్తనల గ్రంథము 44 : 22 (IRVTE)
కచ్చితంగా మేము నీ కోసం రోజంతా వధకు గురౌతున్నాం. వధించడం కోసం ప్రత్యేకించిన గొర్రెల్లాగా ఉన్నాము. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 23 (IRVTE)
ప్రభూ, నువ్వు ఎందుకు నిద్రపోతున్నావు? నిద్ర మేలుకో, మమ్మల్ని శాశ్వతంగా విడిచి పెట్టకు. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 24 (IRVTE)
నీ ముఖాన్ని మాకెందుకు చాటు చేసుకుంటున్నావు? మా వేదననూ మాకు కలిగే హింసనూ మర్చిపోయావెందుకు? [QBR]
కీర్తనల గ్రంథము 44 : 25 (IRVTE)
మా ప్రాణం నేల వరకూ కుంగి పోయింది. మా శరీరం నేలకు కరచుకుని ఉంది. [QBR]
కీర్తనల గ్రంథము 44 : 26 (IRVTE)
మాకు సహాయం చేయడానికి లే. నీ నిబంధన కృపను బట్టి మమ్మల్ని విమోచించు. [PE]
❮
❯