కీర్తనల గ్రంథము 48 : 1 (IRVTE)
ఒక పాట, కోరహు వారసుల కీర్తన. మన దేవుని పట్టణంలో తన పరిశుద్ధ పర్వతంపై యెహోవా గొప్పవాడు. అత్యధికంగా ఆయన్ని స్తుతించాలి.
కీర్తనల గ్రంథము 48 : 2 (IRVTE)
అది మన దేవుని మహా పట్టణం. ఉత్తరం వైపున ఉన్న సీయోను పర్వతం. దాని ఉచ్ఛ దశ ఎంతో సుందరంగా ఉంది. అది భూమి అంతటికీ ఆనందదాయకంగా ఉంది.
కీర్తనల గ్రంథము 48 : 3 (IRVTE)
దాని భవనాలలో దేవుడు తనను ఆశ్రయంగా తెలియజేసుకుంటున్నాడు.
కీర్తనల గ్రంథము 48 : 4 (IRVTE)
చూడండి, రాజులు సమకూడారు. వాళ్ళంతా కలసి వచ్చారు.
కీర్తనల గ్రంథము 48 : 5 (IRVTE)
వాళ్ళు దాన్ని చూశారు. ఆశ్చర్యపోయారు. తర్వాత వ్యాకులపడ్డారు. గబగబా అక్కణ్ణించి వెళ్ళిపోయారు.
కీర్తనల గ్రంథము 48 : 6 (IRVTE)
వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళలో వణుకు పుట్టింది. ప్రసవించబోయే స్త్రీకి కలిగే నొప్పుల్లాటి వేదన వాళ్లకు కలిగింది.
కీర్తనల గ్రంథము 48 : 7 (IRVTE)
తూర్పుగాలిని నువ్వు రేపి దానితో తర్షీషు ఓడలను పగలగొడుతున్నావు.
కీర్తనల గ్రంథము 48 : 8 (IRVTE)
సేనల ప్రభువైన యెహోవా పట్టణంలో, మన దేవుని పట్టణంలో మనం ఏదైతే విన్నామో దానినే చూశాం. దేవుడు దాన్ని కలకాలం ఉండేలా స్థిరం చేశాడు.
కీర్తనల గ్రంథము 48 : 9 (IRVTE)
దేవా, నీ మందిరంలో మేము నీ నిబంధన కృపను ధ్యానం చేశాం.
కీర్తనల గ్రంథము 48 : 10 (IRVTE)
దేవా, నీ నామం గొప్పదైనట్టు నీ కీర్తి కూడా భూమి అంచులవరకూ గొప్పగా ఉంది. నీతి న్యాయాలతో నీ కుడిచెయ్యి నిండి ఉంది.
కీర్తనల గ్రంథము 48 : 11 (IRVTE)
న్యాయమైన నీ శాసనాలను బట్టి సీయోను పర్వతం సంతోషించనీ. యూదా కుమార్తెలను* యూదా కుమార్తెలను యూదాలో ఉన్న గ్రామాలు ఆనందించనీ.
కీర్తనల గ్రంథము 48 : 12 (IRVTE)
సీయోను పర్వతం చుట్టూ తిరుగు. దాని చుట్టూ తిరుగుతూ ఆమె గోపురాలను లెక్కించు.
కీర్తనల గ్రంథము 48 : 13 (IRVTE)
తర్వాత తరం వాళ్ళకు దాని గురించి చెప్పడానికై ఆమె గోడలను పరిశీలించు. ఆమె భవనాలను చూడు.
కీర్తనల గ్రంథము 48 : 14 (IRVTE)
ఈ దేవుడు నిరంతరం మనకు దేవుడుగా ఉన్నాడు. మరణం వరకూ ఆయన మనలను నడిపిస్తాడు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14