కీర్తనల గ్రంథము 49 : 1 (IRVTE)
ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. సర్వ ప్రజలారా! ఈ సంగతి వినండి. ప్రపంచంలో నివసించే వాళ్ళంతా ధ్యాస పెట్టి వినండి.
కీర్తనల గ్రంథము 49 : 2 (IRVTE)
అల్పులూ అధికులూ సంపన్నులూ పేదలూ మీరంతా వినండి.
కీర్తనల గ్రంథము 49 : 3 (IRVTE)
నా నోరు జ్ఞానాన్ని పలుకుతుంది. నా హృదయం వివేకం గూర్చి ధ్యానిస్తుంది.
కీర్తనల గ్రంథము 49 : 4 (IRVTE)
ఒక ఉపమానం నా చెవికి వినిపిస్తుంది. సితారాతో ఆ ఉపమానాన్ని ప్రారంభిస్తాను.
కీర్తనల గ్రంథము 49 : 5 (IRVTE)
నా చుట్టూ ఉన్నవాళ్ళ దోషాలు నా కాళ్ళ చుట్టూ ఉన్నప్పుడు చెడ్డ రోజులకు నేనెందుకు భయపడాలి?
కీర్తనల గ్రంథము 49 : 6 (IRVTE)
వాళ్ళు విస్తరించిన తమ సంపదలను గూర్చి చెప్పుకుంటారు. తమ ఆస్తులనే నమ్ముకుంటారు.
కీర్తనల గ్రంథము 49 : 7 (IRVTE)
వాళ్ళలో ఎవడూ తన సోదరుణ్ణి రక్షించుకోలేడు. తన సోదరుడి కోసం ఎవడూ దేవునికి బంధ విముక్తి వెల చెల్లించలేడు.
కీర్తనల గ్రంథము 49 : 8 (IRVTE)
ఎందుకంటే ఒక వ్యక్తి జీవిత విమోచనకు చాలా వ్యయం అవుతుంది. అది ఎప్పుడైనా ఎంతో వ్యయంతో కూడుకున్నది.
కీర్తనల గ్రంథము 49 : 9 (IRVTE)
ఎవరూ తన శరీరం కుళ్ళిపోకుండా కలకాలం జీవించరు.
కీర్తనల గ్రంథము 49 : 10 (IRVTE)
వాడు తన క్షయాన్ని చూస్తాడు. జ్ఞానులు చనిపోతారు. మూర్ఖుడూ, క్రూరుడూ ఒక్కలాగే నశించిపోతారు. తమ సంపదలను ఇతరులకు విడిచిపెట్టి పోతారు.
కీర్తనల గ్రంథము 49 : 11 (IRVTE)
వాళ్ళు తమ కుటుంబాలు నిరంతరం నిలిచి ఉంటాయనీ, తాము కాపురమున్న ఇళ్ళు అన్ని తరాలకీ ఉంటాయనీ తమ అంతరంగంలో ఆలోచిస్తారు. తాము ఉంటున్న స్థలాలకు తమ స్వంత పేర్లు పెట్టుకుంటారు.
కీర్తనల గ్రంథము 49 : 12 (IRVTE)
కానీ మనిషన్నవాడు ఎంత సంపన్నుడైనా శాశ్వతంగా సజీవంగా ఉండడు. మృగాల్లాగానే వాడూ నశించిపోతాడు.
కీర్తనల గ్రంథము 49 : 13 (IRVTE)
ఈ మార్గం వాళ్ళ మార్గం. అవివేక మార్గం. అయినా మనుషులు వాళ్ళ వాదనలను ఆమోదిస్తూ ఉంటారు.
కీర్తనల గ్రంథము 49 : 14 (IRVTE)
వాళ్ళంతా ఒక గుంపుగా పాతాళానికి వెళ్ళడానికే సిద్ధపడుతున్నారు. మరణం వాళ్లకి కాపరిగా ఉంటుంది. ఉదయాన వాళ్ళపై యథార్థవంతులకు పూర్తి అధికారం ఉంటుంది. వాళ్ళ సౌందర్యానికి నిలువ నీడ లేకుండా పాతాళం వారిని మింగి వేస్తుంది.
కీర్తనల గ్రంథము 49 : 15 (IRVTE)
అయితే దేవుడు నా ప్రాణాన్ని పాతాళం శక్తి నుండి కాపాడతాడు. ఆయన నన్ను స్వీకరిస్తాడు.
కీర్తనల గ్రంథము 49 : 16 (IRVTE)
ఒక వ్యక్తి ధనవంతుడైతే అతని వంశ ప్రభావం* ప్రభావం సంపద అధికమౌతూ ఉన్నప్పుడు నువ్వు భయపడవద్దు.
కీర్తనల గ్రంథము 49 : 17 (IRVTE)
ఎందుకంటే వాడు చనిపోయేటప్పుడు దేన్నీ తీసుకువెళ్ళడు. వాడి ప్రభావం వాడి వెంట దిగిపోదు.
కీర్తనల గ్రంథము 49 : 18 (IRVTE)
మనుషులు నీ జీవితాన్ని నువ్వు చక్కగా నడిపించుకున్నావు అని పొగుడుతారు. వాడు బతికినన్నాళ్ళూ తనను తాను మెచ్చుకుంటాడు.
కీర్తనల గ్రంథము 49 : 19 (IRVTE)
అయినా వాడు తన పితరుల తరానికి చేరవలసిందే. వాళ్ళు ఎన్నటికీ వెలుగును చూడరు.
కీర్తనల గ్రంథము 49 : 20 (IRVTE)
ధనముండీ వివేకం లేనివాడు మృగం వంటివాడు. వాడు నశించిపోతాడు.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20