కీర్తనల గ్రంథము 51 : 5 (IRVTE)
ఇదిగో, నేను పాపంలో పుట్టాను. నా తల్లి నన్ను గర్భం ధరించిన క్షణంలోనే నేను పాపంలో ఉన్నాను.* క్రైస్తవులు చాలా మంది ఈ వచనాన్ని పొరపాటుగా అర్థం చేసుకుంటారు. నా తల్లి పాపంలో నన్ను గర్భం దాల్చింది అంటే, ఆమె పాపం చేయడం మూలంగా నేను పుట్టాను అనుకుంటారు. అంటే తల్లి, తండ్రి నన్ను కనడం కోసం చేసే లైంగిక క్రియ పాపం అనే అభిప్రాయంలో ఉంటారు. భార్యాభర్తల మధ్య జరిగేది ఒక్కనాటికీ పాపం ఎంతమాత్రం కానేరదు. పరిశుద్ధ వివాహం చేసుకున్న వారి మధ్య లైంగిక క్రియ పవిత్రం. స్త్రీ సాంగత్యం వలన అపవిత్రం కాని వారు అని ప్రకటన 14:4 లో రాసి ఉన్న దాన్ని కూడా ఈ విధంగానే అపార్థం చేసుకుంటారు. దీన్నిబట్టి పెళ్లి చేసుకున్న వారు తప్పనిసరిగా అపవిత్రులేననీ, పవిత్రంగా ఉండడం అంటే బ్రహ్మచారిగా కన్యగా ఉండిపోవడం అనీ భావిస్తారు. పరిశుద్ధ వివాహంలో జత అయిన వారిని వివాహ సంబంధం ఎంత మాత్రం అపవిత్రులుగా చెయ్యదు. అలాగైతే దేవుడు వివాహాన్ని నియమించే వాడే కాదు.
ఈ వచనానికి అర్థం నేను తల్లి కడుపులో పడిన క్షణం నుంచీ పాపినే అని.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19