కీర్తనల గ్రంథము 53 : 1 (IRVTE)
దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. వారు చెడిపోయారు, అసహ్యకార్యాలు చేస్తారు. మంచి జరిగించేవాడు ఒక్కడూ లేడు. [QBR]
కీర్తనల గ్రంథము 53 : 2 (IRVTE)
జ్ఞానం కలిగి తనను వెదికేవారు ఉన్నారేమో అని దేవుడు ఆకాశం నుండి మనుషులను పరిశీలించాడు. [QBR]
కీర్తనల గ్రంథము 53 : 3 (IRVTE)
వారంతా దారి తప్పి పూర్తిగా చెడిపోయారు. మంచి చేసే వాడు లేడు. ఒక్కడూ లేడు. [QBR]
కీర్తనల గ్రంథము 53 : 4 (IRVTE)
వారు దేవునికి ప్రార్థన చేయరు. వారు నా ప్రజలను దోచుకున్నారు [* వారు నా ప్రజలను దోచుకున్నారు రొట్టెను తిన్నట్టుగా నా ప్రజలను తినేస్తూ దుర్మార్గం జరిగిస్తారు] . వారికి ఏమీ తెలియడం లేదా? [QBR]
కీర్తనల గ్రంథము 53 : 5 (IRVTE)
భయకారణం లేకుండానే వారు భయభ్రాంతులయ్యారు. ఎందుకంటే నీకు వ్యతిరేకంగా పోగయ్యే వారి ఎముకలను దేవుడు విరగ్గొడతాడు. దేవుడు వారిని తోసిపుచ్చాడు కాబట్టి వారు సిగ్గుపడతారు. [QBR]
కీర్తనల గ్రంథము 53 : 6 (IRVTE)
సీయోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగుతుంది. దేవుడు తన ప్రజలను చెరలో నుండి వెనక్కి రప్పించేటప్పుడు యాకోబు సంతానం హర్షిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు సంతోషిస్తారు. [PE]

1 2 3 4 5 6

BG:

Opacity:

Color:


Size:


Font: