కీర్తనల గ్రంథము 55 : 1 (IRVTE)
ప్రధాన సంగీతకారుని కోసం. తీగెల వాయిద్యాలపై పాడేది. దావీదు రాసిన దైవధ్యానం దేవా, నా ప్రార్థన శ్రద్ధగా విను. నా విన్నపాలకు నీ ముఖం తిప్పుకోకు.
కీర్తనల గ్రంథము 55 : 2 (IRVTE)
నా మనవి విని నాకు జవాబు ఇవ్వు. నాకున్న కష్టాల వల్ల నాకు నెమ్మది లేదు.
కీర్తనల గ్రంథము 55 : 3 (IRVTE)
ఎందుకంటే నా శత్రువులు చేస్తున్న పెద్ద శబ్దాల వల్ల, దుర్మార్గులు చేస్తున్న బలాత్కారాల వల్ల నేను చింతలో మునిగిపోయి మూలుగుతున్నాను. వాళ్ళు నన్ను ఎంతగానో కష్టాలపాలు చేస్తున్నారు. ఆగ్రహంతో నన్ను హింసిస్తున్నారు.
కీర్తనల గ్రంథము 55 : 4 (IRVTE)
నా గుండె నాలో వేదన పడుతున్నది. మరణ భయం నాకు కలుగుతున్నది.
కీర్తనల గ్రంథము 55 : 5 (IRVTE)
దిగులు, వణుకు నాకు కలుగుతున్నాయి. తీవ్ర భయం నన్ను ముంచెత్తింది.
కీర్తనల గ్రంథము 55 : 6 (IRVTE)
ఆహా, నాకు గనక రెక్కలుంటే గువ్వలాగా నేను ఎగిరిపోయి నెమ్మదిగా ఉంటాను.
కీర్తనల గ్రంథము 55 : 7 (IRVTE)
త్వరగా పారిపోయి అరణ్యంలో నివసిస్తాను.
కీర్తనల గ్రంథము 55 : 8 (IRVTE)
పెనుగాలిని, సుడిగాలిని తప్పించుకుంటాను, అనుకున్నాను.
కీర్తనల గ్రంథము 55 : 9 (IRVTE)
పట్టణంలో హింస, కలహాలు నేను చూశాను. ప్రభూ, అలాటి పనులు చేసేవారిని నిర్మూలం చెయ్యి. వారి మాటలు తారుమారు చెయ్యి.
కీర్తనల గ్రంథము 55 : 10 (IRVTE)
రాత్రింబగళ్లు వారు పట్టణ సరిహద్దుల్లో తిరుగుతున్నారు. అక్కడ అంతా పాపం, చెడుతనం జరుగుతూ ఉంది.
కీర్తనల గ్రంథము 55 : 11 (IRVTE)
అక్కడ దుర్మార్గం కొనసాగుతూ ఉంది. అణచివేత, కపటం దాని వీధుల్లో జరుగుతూనే ఉన్నాయి.
కీర్తనల గ్రంథము 55 : 12 (IRVTE)
నన్ను దూషించేవాడు శత్రువు కాడు. శత్రువైతే నేను దాన్ని సహించేవాడినే. నా పైకి లేచినవాడు నా పగవాడు కాడు. అదే అయితే నేను దాక్కోవచ్చు.
కీర్తనల గ్రంథము 55 : 13 (IRVTE)
ఆ పని చేసింది నువ్వు అంటే నా నెచ్చెలివి, నా చెలికాడివి. నా ప్రియమిత్రుడివి.
కీర్తనల గ్రంథము 55 : 14 (IRVTE)
మనం కలిసి మధుర సహవాసం అనుభవించాం. ఉత్సవంగా దేవుని మందిరానికి వెళ్లాం.
కీర్తనల గ్రంథము 55 : 15 (IRVTE)
చావు వారి మీదికి అకస్మాత్తుగా ముంచుకు వస్తుంది. ప్రాణంతోనే వారు పాతాళానికి దిగిపోతారు. ఎందుకంటే చెడుతనం వారి ఇళ్ళలో, వారి అంతరంగంలో ఉంది.
కీర్తనల గ్రంథము 55 : 16 (IRVTE)
అయితే నేను దేవునికి మొరపెడతాను. యెహోవా నన్ను రక్షిస్తాడు.
కీర్తనల గ్రంథము 55 : 17 (IRVTE)
సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానిస్తూ మొరపెడతాను. ఆయన నా ప్రార్థన వింటాడు.
కీర్తనల గ్రంథము 55 : 18 (IRVTE)
నా శత్రువులు చాలామంది ఉన్నారు. అయితే వారు నా మీదికి రాకుండా చేసి ఆయన నా ప్రాణాన్ని విమోచించి, శాంతిసమాధానాలు అనుగ్రహించాడు.
కీర్తనల గ్రంథము 55 : 19 (IRVTE)
పూర్వకాలం నుండి ఉన్న దేవుడు మారుమనస్సు లేనివారికి, తనకు భయపడని వారికి జవాబు చెబుతాడు.
కీర్తనల గ్రంథము 55 : 20 (IRVTE)
నా స్నేహితుడు తనతో శాంతి సమాధానాలతో ఉన్నవారి పైకి తన చెయ్యి ఎత్తాడు. వారితో తాను చేసిన నిబంధన మీరాడు.
కీర్తనల గ్రంథము 55 : 21 (IRVTE)
అతని నోటి మాటలు వెన్నలాగా మృదువుగా ఉన్నాయి. కాని అతని హృదయం నిండా కలహం ఉంది. అతని మాటలు నూనె కంటే నునుపుగా ఉంటాయి గానీ అవి నిజానికి దూసుకు వస్తున్న కత్తులు.
కీర్తనల గ్రంథము 55 : 22 (IRVTE)
నీ భారం యెహోవా మీద ఉంచు. ఆయనే నిన్ను ఆదుకుంటాడు. నీతిమంతులను ఆయన ఎన్నడూ కూలిపోనియ్యదు.
కీర్తనల గ్రంథము 55 : 23 (IRVTE)
దేవా, నువ్వు దుష్టులను నాశనకూపంలో పడవేస్తావు. ఇతరులతో పోలిస్తే రక్తాపరాధులు, వంచకులు సగం కంటే ఎక్కువకాలం బతకరు. నేనైతే నీలోనే నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నాను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23