కీర్తనల గ్రంథము 61 : 1 (IRVTE)
ప్రధాన సంగీతకారుని కోసం. తీగె వాయిద్యాలతో పాడేది. దావీదు కీర్తన దేవా, నా మొర ఆలకించు, నా ప్రార్థన శ్రద్ధగా విను.
కీర్తనల గ్రంథము 61 : 2 (IRVTE)
నా ప్రాణం తల్లడిల్లినప్పుడు భూదిగంతాల నుండి నీకు మొరపెడతాను. నేను ఎక్కలేనంత ఎత్తయిన కొండ పైకి నన్ను ఎక్కించు.
కీర్తనల గ్రంథము 61 : 3 (IRVTE)
నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. నా శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు.
కీర్తనల గ్రంథము 61 : 4 (IRVTE)
యుగయుగాలు నేను నీ గుడారంలో నివసిస్తాను, నీ రెక్కల కింద దాక్కుంటాను. QSS సెలా.SE
కీర్తనల గ్రంథము 61 : 5 (IRVTE)
దేవా, నువ్వు నా మొక్కుబడులు అంగీకరించావు. నీ నామాన్ని గౌరవించే వారికిచ్చే వారసత్వాన్ని నాకు అనుగ్రహించావు.
కీర్తనల గ్రంథము 61 : 6 (IRVTE)
రాజుకు దీర్ఘాయువు కలుగజేస్తావు గాక, అతని సంవత్సరాలు తరతరాలు నడుస్తాయి గాక.
కీర్తనల గ్రంథము 61 : 7 (IRVTE)
అతడు నిత్యం దేవుని సన్నిధిలో నివసిస్తాడు గాక. అతని కాపుదల కోసం నీ కృపాసత్యాలను నియమించు.
కీర్తనల గ్రంథము 61 : 8 (IRVTE)
ప్రతి రోజూ నా మొక్కుబడులు నేను చెల్లించేలా నీ నామాన్ని నిత్యం కీర్తిస్తాను.
❮
❯