కీర్తనల గ్రంథము 64 : 1 (IRVTE)
దేవా, నేను మొర పెట్టినప్పుడు నా మనవి విను. నా శత్రువుల భయం నుండి నా ప్రాణాన్ని కాపాడు. [QBR]
కీర్తనల గ్రంథము 64 : 2 (IRVTE)
దుర్మార్గుల కుట్ర నుండి, దుష్టక్రియలు చేసేవారి అల్లరి నుండి నన్ను దాచిపెట్టు. [QBR]
కీర్తనల గ్రంథము 64 : 3 (IRVTE)
ఒకడు కత్తికి పదునుపెట్టేలా వారు తమ నాలుకలకు పదును పెడతారు. చేదు మాటలు అనే బాణాలను వారు ఎక్కుపెట్టారు. [QBR]
కీర్తనల గ్రంథము 64 : 4 (IRVTE)
నిరపరాధులను కొట్టాలని రహస్య స్థలాల్లో ఆ బాణాలు సంధిస్తారు. ఏమాత్రం భయపడకుండా వారు అకస్మాత్తుగా వారిని కొడతారు. [QBR]
కీర్తనల గ్రంథము 64 : 5 (IRVTE)
వారు దురాలోచనలు చేస్తూ తమను తాము ప్రోత్సాహ పరచుకుంటారు. చాటుగా వల పన్నడానికి ఆలోచిస్తారు. మనలను [* మనలను వారిని ] ఎవరు చూస్తారులే అని చెప్పుకుంటారు. [QBR]
కీర్తనల గ్రంథము 64 : 6 (IRVTE)
వారు చెడ్డపనులు చేయడానికి కొత్త ప్రణాళికలు తయారు చేస్తారు. ఇది మంచి పన్నాగం, చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేశాం అని వారు చెప్పుకుంటారు. మానవుని హృదయంలోని ఆలోచనలు చాలా లోతైనవి. [QBR]
కీర్తనల గ్రంథము 64 : 7 (IRVTE)
దేవుడు వారిని బాణాలతో కొడతాడు. ఉన్నట్టుండి వారు గాయాల పాలవుతారు. [QBR]
కీర్తనల గ్రంథము 64 : 8 (IRVTE)
వారు కూలిపోతారు. దానికి కారణం వారి నాలుకలే. వారిని చూసిన వారంతా తలలు ఊపుతారు. [QBR]
కీర్తనల గ్రంథము 64 : 9 (IRVTE)
మనుషులంతా భయం కలిగి దేవుడు చేసిన పనులు ప్రకటిస్తారు. ఆయన కార్యాలను గూర్చి చక్కగా ఆలోచిస్తారు. [QBR]
కీర్తనల గ్రంథము 64 : 10 (IRVTE)
నీతిపరులు యెహోవాను బట్టి సంతోషిస్తూ ఆయనలో ఆశ్రయం పొందుతారు. యథార్థవంతులు ఆయనలో గర్విస్తారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: