కీర్తనల గ్రంథము 75 : 1 (IRVTE)
దేవా, మేము నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. నువ్వు నీ సన్నిధిని మాకు వెల్లడించావని నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాము. మనుషులు నీ ఆశ్చర్యకార్యాలు వివరిస్తారు. [QBR]
కీర్తనల గ్రంథము 75 : 2 (IRVTE)
నియామక కాలంలో నేను నిష్పక్షపాతంగా తీర్పు తీరుస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 75 : 3 (IRVTE)
భూమి, దాని నివాసులంతా భయంతో వణుకుతున్నప్పుడు నేనే ఈ భూమి స్థంభాలను నిలబెడతాను. సెలా.
కీర్తనల గ్రంథము 75 : 4 (IRVTE)
అహంకారంగా ఉండవద్దు అని గర్విష్టులకు ఆజ్ఞాపిస్తున్నాను. [QBR]
కీర్తనల గ్రంథము 75 : 5 (IRVTE)
విజయం దొరుకుతుందని అంతగా నమ్మకం పెట్టుకోవద్దు. మీ తలలు పైకెత్తి మాట్లాడవద్దు అని దుర్మార్గులతో చెప్పాను. [QBR]
కీర్తనల గ్రంథము 75 : 6 (IRVTE)
తూర్పునుండి గానీ పడమటి నుండి గానీ అరణ్యం నుండి గానీ విజయం రాదు. [QBR]
కీర్తనల గ్రంథము 75 : 7 (IRVTE)
దేవుడే తీర్పు తీర్చేవాడు. ఆయన ఒకణ్ణి తగ్గిస్తాడు, ఒకణ్ణి హెచ్చిస్తాడు. [QBR]
కీర్తనల గ్రంథము 75 : 8 (IRVTE)
యెహోవా చేతిలో ఒక పాత్ర ఉంది. అందులోని ద్రాక్షారసం పొంగుతూ ఉంది. అది సుగంధ ద్రవ్యాలతో నిండి ఉంది. ఆయన దాన్ని పోస్తున్నాడు. [QBR] భూమిమీద ఉన్న దుర్మార్గులంతా ఆఖరు బొట్టు వరకు దాన్ని తాగాలి. [QBR]
కీర్తనల గ్రంథము 75 : 9 (IRVTE)
నేనైతే ఎప్పుడూ నువ్వు చేసిన కార్యాలను ప్రచారం చేస్తాను. యాకోబు దేవుణ్ణి నేను నిత్యమూ కీర్తిస్తాను. [QBR]
కీర్తనల గ్రంథము 75 : 10 (IRVTE)
నేను భక్తిహీనుల కొమ్ములను [* కొమ్ములను శక్తి] విరగగొడతాను. నీతిమంతుల కొమ్ములు పైకెత్తుతాను అని ఆయన అన్నాడు. [PE]
❮
❯