కీర్తనల గ్రంథము 76 : 1 (IRVTE)
యూదాలో దేవుడు తనను తెలియబరచుకున్నాడు. ఇశ్రాయేలులో ఆయన నామం ఘనమైనది. [QBR]
కీర్తనల గ్రంథము 76 : 2 (IRVTE)
షాలేంలో [* షాలేంలో యెరూషలేము] ఆయన నివాసం ఉంది, సీయోనులో ఆయన గృహం ఉంది. [QBR]
కీర్తనల గ్రంథము 76 : 3 (IRVTE)
అక్కడ ఆయన విల్లంబులు, డాలు, కత్తి మిగతా యుద్ధాయుధాలను విరిచి వేశాడు. సెలా.
కీర్తనల గ్రంథము 76 : 4 (IRVTE)
నువ్వు నీ శత్రువులను జయించి పర్వతాల నుంచి దిగి వస్తూ మెరిసిపోతున్నావు. నీ మహిమను ప్రదర్శిస్తున్నావు. [QBR]
కీర్తనల గ్రంథము 76 : 5 (IRVTE)
గుండె ధైర్యం గలవారు దోపిడికి గురి అయ్యారు. నిద్రపోయారు. శూరులంతా నిస్సహాయులయ్యారు. [QBR]
కీర్తనల గ్రంథము 76 : 6 (IRVTE)
యాకోబు దేవా, యుద్ధంలో నీ గద్దింపుకు గుర్రం, రౌతు కూడా మూర్ఛిల్లారు. [QBR]
కీర్తనల గ్రంథము 76 : 7 (IRVTE)
నీకు, నీకు మాత్రమే భయపడాలి. నువ్వు కోపపడితే నీ ఎదుట ఎవరు నిలుస్తారు? [QBR]
కీర్తనల గ్రంథము 76 : 8 (IRVTE)
నీ తీర్పు పరలోకం నుంచి వచ్చింది, భూమికి భయమేసింది, అది మౌనంగా ఉంది. [QBR]
కీర్తనల గ్రంథము 76 : 9 (IRVTE)
దేవా! నువ్వు తీర్పు ప్రకటించడానికి, దేశమంతటా అణగారిన వాళ్ళను కాపాడడానికి లేచావు. సెలా.
కీర్తనల గ్రంథము 76 : 10 (IRVTE)
కోపంతో వారిపై నీ తీర్పు ప్రజలు కచ్చితంగా నిన్ను స్తుతించేలా చేస్తుంది. నీ ఆగ్రహాన్ని నువ్వు పూర్తిగా వెల్లడిస్తావు. [QBR]
కీర్తనల గ్రంథము 76 : 11 (IRVTE)
మీ యెహోవా దేవునికి మొక్కుకుని వాటిని చెల్లించండి. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా భయభక్తులకు పాత్రుడైన ఆయనకు కానుకలు తీసుకు రండి. [QBR]
కీర్తనల గ్రంథము 76 : 12 (IRVTE)
అధికారుల పొగరును ఆయన అణచివేస్తాడు, భూరాజులు ఆయనకు భయపడతారు. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: