కీర్తనల గ్రంథము 8 : 1 (IRVTE)
ప్రధాన సంగీతకారుని కోసం దావీదు కీర్తన. గిత్తీత్ రాగం. యెహోవా మా ప్రభూ, పై ఆకాశాలలో నీ మహిమను చూపించేవాడా, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది!
కీర్తనల గ్రంథము 8 : 2 (IRVTE)
శత్రువునూ, ప్రతీకారం చేసేవాణ్ణీ నోరు మూయించడానికీ, నీ విరోధుల కారణంగా, పసికందుల, చంటి పిల్లల నోటిలో నువ్వు స్తుతిని సృష్టించావు.
కీర్తనల గ్రంథము 8 : 3 (IRVTE)
నీ చేతి వేళ్ళు తయారు చేసిన నీ ఆకాశాలనూ, వాటి తావులలో నీవుంచిన చంద్రనక్షత్రాలనూ నేను చూసినప్పుడు,
కీర్తనల గ్రంథము 8 : 4 (IRVTE)
నువ్వు పట్టించుకోవడానికి మానవజాతి ఏ పాటిది? నువ్వు మానవాళి పట్ల శ్రద్ధ చూపడానికి వారు ఎంతటివాళ్ళు?
కీర్తనల గ్రంథము 8 : 5 (IRVTE)
అయినా, నువ్వు వాళ్ళను స్వర్గలోక ప్రాణులకన్నా కొంచెం మాత్రమే తక్కువగా చేశావు. వాళ్లకు మహిమా ప్రభావాల కిరీటం పెట్టావు.
కీర్తనల గ్రంథము 8 : 6 (IRVTE)
నీ చేతిపనుల మీద అతనికి పరిపాలన ఇచ్చావు. అతడి పాదాల కింద సమస్తమును ఉంచావు* హీబ్రూ 2:6-9 చూడండి .
కీర్తనల గ్రంథము 8 : 7 (IRVTE)
గొర్రెలను, ఎడ్లను, అడవి మృగాలను సైతం,
కీర్తనల గ్రంథము 8 : 8 (IRVTE)
ఆకాశ పక్షులను, సముద్ర ప్రాణులను, సముద్ర ప్రవాహాల్లో తిరిగే వాటిని నువ్వు అతని పాదాల కింద ఉంచావు.
కీర్తనల గ్రంథము 8 : 9 (IRVTE)
యెహోవా మా ప్రభూ, భూమి అంతటిలో నీ నామం ఎంత వైభవం గలది!

1 2 3 4 5 6 7 8 9