కీర్తనల గ్రంథము 80 : 1 (IRVTE)
ప్రధాన సంగీతకారుని కోసం, సోషన్నీము ఏదూత్ (ఒడంబడిక కలువలు) రాగంతో పాడేది. ఆసాపు కీర్తన. ఇశ్రాయేలు కాపరీ! మందలాగా యోసేపును నడిపించేవాడా, విను. కెరూబులకు పైగా ఆసీనుడవైనవాడా, మా మీద ప్రకాశించు.
కీర్తనల గ్రంథము 80 : 2 (IRVTE)
ఎఫ్రాయిము బెన్యామీను మనష్షే గోత్రాల ఎదుట నీ బల ప్రభావాలను చూపించు. వచ్చి మమ్మల్ని కాపాడు.
కీర్తనల గ్రంథము 80 : 3 (IRVTE)
దేవా, చెరలోనుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనివ్వు.
కీర్తనల గ్రంథము 80 : 4 (IRVTE)
యెహోవా, సేనల ప్రభువైన దేవా, నీ ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటే నువ్వెంతకాలం కోపపడతావు?
కీర్తనల గ్రంథము 80 : 5 (IRVTE)
కన్నీళ్లు వారికి ఆహారంగా ఇస్తున్నావు. తాగడానికి కడివెడు కన్నీళ్లు వాళ్లకిచ్చావు.
కీర్తనల గ్రంథము 80 : 6 (IRVTE)
మా పొరుగువారు మా గురించి ఘర్షణ పడేలా చేస్తున్నావు, మా శత్రువులు తమలోతాము మమ్మల్ని చూసి నవ్వుతున్నారు.
కీర్తనల గ్రంథము 80 : 7 (IRVTE)
సేనల ప్రభువైన దేవా, చెరలోనుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా నీ ముఖకాంతి మా మీద ప్రకాశించనివ్వు.
కీర్తనల గ్రంథము 80 : 8 (IRVTE)
నువ్వు ఈజిప్టులోనుంచి ఒక ద్రాక్షాతీగె తెచ్చావు, ఇతర రాజ్యాలను వెళ్లగొట్టి దాన్ని నాటావు.
కీర్తనల గ్రంథము 80 : 9 (IRVTE)
దాని కోసం నేల సిద్ధం చేశావు. అది లోతుగా వేరు పారి దేశమంతా వ్యాపించింది.
కీర్తనల గ్రంథము 80 : 10 (IRVTE)
దాని నీడ కొండలను కప్పింది. దాని తీగెలు దేవుని దేవదారు చెట్లను కమ్మేశాయి,
కీర్తనల గ్రంథము 80 : 11 (IRVTE)
దాని తీగెలు సముద్రం వరకూ దాని రెమ్మలు యూఫ్రటీసు నది వరకూ వ్యాపించాయి.
కీర్తనల గ్రంథము 80 : 12 (IRVTE)
దారిన పోయేవాళ్ళంతా దాని పళ్ళు కోసేలా దాని కంచెలను నువ్వెందుకు పడగొట్టావు?
కీర్తనల గ్రంథము 80 : 13 (IRVTE)
అడవిపందులు దాన్ని పాడు చేస్తున్నాయి, పొలంలోని పశువులు దాన్ని మేస్తున్నాయి.
కీర్తనల గ్రంథము 80 : 14 (IRVTE)
సేనల ప్రభువైన దేవా, వెనక్కి చూడు. ఆకాశం నుంచి చూచి ఈ ద్రాక్షావల్లిని గమనించు.
కీర్తనల గ్రంథము 80 : 15 (IRVTE)
నీ కుడిచెయ్యి నాటింది ఈ వేరునే. ఈ కొమ్మనే నువ్వు పెంచావు.
కీర్తనల గ్రంథము 80 : 16 (IRVTE)
దాన్ని నరికి కాల్చివేశారు, నీ గద్దింపుతో నీ శత్రువులు నశించుదురు గాక.
కీర్తనల గ్రంథము 80 : 17 (IRVTE)
నీ కుడిచెయ్యి మనిషి మీద ఉంచు. నువ్వు బలపరచిన మానవ పుత్రుని మీద నీ చెయ్యి ఉంచు.
కీర్తనల గ్రంథము 80 : 18 (IRVTE)
అప్పుడు మేము నీ దగ్గరనుంచి వెనక్కి వెళ్ళం, మమ్మల్ని బతికించు. అప్పుడు నీ పేరునే ప్రార్థన చేస్తాం.
కీర్తనల గ్రంథము 80 : 19 (IRVTE)
యెహోవా, సేనల ప్రభువైన దేవా, చెరలో నుంచి మమ్మల్ని రప్పించు, మాకు విడుదల దొరికేలా, నీ ముఖకాంతి మా మీద ప్రకాశించ నివ్వు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19