కీర్తనల గ్రంథము 81 : 1 (IRVTE)
మనకు బలం అయిన దేవునికి బిగ్గరగా పాడండి, యాకోబు దేవునికి ఉత్సాహంగా కేకలు వేయండి. [QBR]
కీర్తనల గ్రంథము 81 : 2 (IRVTE)
పాట పాడి, కంజరి వాయించండి, మధురంగా తీగ వాయిద్యాలు వాయించండి. [QBR]
కీర్తనల గ్రంథము 81 : 3 (IRVTE)
అమావాస్య రోజు, మన పండగ మొదలయ్యే పౌర్ణమి రోజు కొమ్ము ఊదండి. [QBR]
కీర్తనల గ్రంథము 81 : 4 (IRVTE)
అది ఇశ్రాయేలీయులకు చట్టం. యాకోబు దేవుడు నిర్ణయించిన కట్టడ. [QBR]
కీర్తనల గ్రంథము 81 : 5 (IRVTE)
ఆయన ఈజిప్టు దేశం మీదికి దండెత్తినప్పుడు యోసేపు సంతతికి దీన్ని శాసనంగా నియమించాడు. అక్కడ నేనెరగని భాష విన్నాను. [QBR]
కీర్తనల గ్రంథము 81 : 6 (IRVTE)
వారి భుజాల నుంచి నేను బరువు దించాను, వారి చేతులు మోతగంపలు మోయకుండా విడుదల పొందాయి. [QBR]
కీర్తనల గ్రంథము 81 : 7 (IRVTE)
నీ ఆపదలో నువ్వు మొరపెట్టావు. నేను నిన్ను విడిపించాను. ఉరిమే మబ్బుల్లోనుంచి నీకు జవాబిచ్చాను. మెరీబా నీళ్ళ దగ్గర నీకు పరీక్ష పెట్టాను. సెలా.
కీర్తనల గ్రంథము 81 : 8 (IRVTE)
నా ప్రజలారా, వినండి. ఎందుకంటే నేను మిమ్మల్ని హెచ్చరిస్తాను. అయ్యో ఇశ్రాయేలూ, నువ్వు నా మాట వింటే ఎంత బాగుండేది! [QBR]
కీర్తనల గ్రంథము 81 : 9 (IRVTE)
ఇతర దేవుళ్ళు ఎవరూ మీ మధ్య ఉండకూడదు, వేరే దేవుళ్ళలో ఎవరినీ నువ్వు పూజించకూడదు. [QBR]
కీర్తనల గ్రంథము 81 : 10 (IRVTE)
నేనే మీ దేవుణ్ణి, యెహోవాను. ఈజిప్టు దేశంనుంచి మిమ్మల్ని తెచ్చింది నేనే. నీ నోరు బాగా తెరువు. నేను దాన్ని నింపుతాను. [QBR]
కీర్తనల గ్రంథము 81 : 11 (IRVTE)
అయితే నా ప్రజలు నా మాట వినలేదు, ఇశ్రాయేలీయులు నాకు లోబడలేదు. [QBR]
కీర్తనల గ్రంథము 81 : 12 (IRVTE)
కాబట్టి వాళ్ళు తమ సొంత ఉద్దేశాలను అనుసరించనిచ్చాను. వారి హృదయకాఠిన్యానికి నేను వారిని అప్పగించాను. [QBR]
కీర్తనల గ్రంథము 81 : 13 (IRVTE)
అయ్యో, నా ప్రజలు నా మాట వింటే ఎంత బాగుండేది! నా ప్రజలు నా విధానాలు అనుసరిస్తే ఎంత బాగుండేది! [QBR]
కీర్తనల గ్రంథము 81 : 14 (IRVTE)
అప్పుడు నేను త్వరగా వారి శత్రువులను అణిచి వేసేవాణ్ణి. వాళ్ళను అణిచి వేసేవారి మీదికి నా చెయ్యి ఎత్తుతాను. [QBR]
కీర్తనల గ్రంథము 81 : 15 (IRVTE)
యెహోవాను ద్వేషించేవాళ్ళు ఆయనకు భయంతో వినయంగా ఆయన ఎదుట ప్రణమిల్లుతారు. వాళ్ళు శాశ్వతంగా అవమానానికి గురి అవుతారు గాక! [QBR]
కీర్తనల గ్రంథము 81 : 16 (IRVTE)
అతిశ్రేష్ఠమైన గోదుమలతో నేను ఇశ్రాయేలును పోషిస్తాను, కొండ తేనెతో నిన్ను తృప్తిపరుస్తాను. [PE]
❮
❯