కీర్తనల గ్రంథము 83 : 1 (IRVTE)
ఒక పాట. ఆసాపు కీర్తన. దేవా, మౌనంగా ఉండవద్దు! దేవా, మమ్మల్ని పట్టించుకోకుండా స్పందించకుండా ఉండవద్దు.
కీర్తనల గ్రంథము 83 : 2 (IRVTE)
నీ శత్రువులు నీకు ఎదురు తిరుగుతున్నారు, నిన్ను ద్వేషించే వాళ్ళు రెచ్చిపోతున్నారు.
కీర్తనల గ్రంథము 83 : 3 (IRVTE)
నీ ప్రజల మీద వాళ్ళు కుట్ర పన్నుతున్నారు. నువ్వు కాపాడే వాళ్ళ మీద దురాలోచన చేస్తున్నారు.
కీర్తనల గ్రంథము 83 : 4 (IRVTE)
వాళ్ళిలా చెబుతున్నారు, వాళ్ళ రాజ్యాన్ని నాశనం చేద్దాం రండి. అప్పుడు ఇశ్రాయేలు అనే పేరు ఇక గుర్తుకు రాకుండా ఉంటుంది.
కీర్తనల గ్రంథము 83 : 5 (IRVTE)
ఏకగ్రీవంగా వాళ్ళు ఆలోచన చేశారు. నీకు విరోధంగా ఒప్పందాలు చేసుకున్నారు.
కీర్తనల గ్రంథము 83 : 6 (IRVTE)
గుడారాల్లో జీవించే ఎదోమీయులు, ఇష్మాయేలీయులు, మోయాబీయులు, హగ్రీయీలు,
కీర్తనల గ్రంథము 83 : 7 (IRVTE)
గెబలు జాతి వాళ్ళు, అమ్మోనీయులు, అమాలేకీయులు, ఫిలిష్తీయులు, తూరు నివాసులు,
కీర్తనల గ్రంథము 83 : 8 (IRVTE)
అష్షూరు దేశస్థులు వాళ్ళ పక్షాన చేరారు. లోతు వంశస్థులకు వాళ్ళు సాయం చేస్తున్నారు. QSS సెలా SE
కీర్తనల గ్రంథము 83 : 9 (IRVTE)
నువ్వు మిద్యానుకు ఏమి చేశావో కీషోను వాగు దగ్గర నువ్వు సీసెరాకు, యాబీనుకు ఏమి చేశావో అలాగే వారికి చెయ్యి.
కీర్తనల గ్రంథము 83 : 10 (IRVTE)
వాళ్ళు ఏన్దోరు దగ్గర నాశనమై పోయారు. నేలకు ఎరువు అయ్యారు.
కీర్తనల గ్రంథము 83 : 11 (IRVTE)
ఓరేబు, జెయేబు నాయకులకు నువ్వు చేసినట్టు వారి ప్రధానులకు చెయ్యి. జెబహు సల్మున్నా అనే వారికి నువ్వు చేసినట్టు వాళ్ళ రాజులందరికీ చెయ్యి.
కీర్తనల గ్రంథము 83 : 12 (IRVTE)
దేవుని పచ్చిక భూములను మనం ఆక్రమించుకుందాం అని వాళ్ళు అంటున్నారు.
కీర్తనల గ్రంథము 83 : 13 (IRVTE)
నా దేవా, సుడి తిరిగే దుమ్ములాగా, గాలికి కొట్టుకుపోయే పొట్టులాగా వాళ్ళను చెయ్యి.
కీర్తనల గ్రంథము 83 : 14 (IRVTE)
మంటలు అడవిని కాల్చివేసినట్టు, కారుచిచ్చు కొండలను తగలబెట్టినట్టు,
కీర్తనల గ్రంథము 83 : 15 (IRVTE)
నీ తుఫానుతో వాళ్ళను తరిమి వెయ్యి. నీ సుడిగాలిచేత వారికి భయం పుట్టించు.
కీర్తనల గ్రంథము 83 : 16 (IRVTE)
యెహోవా, వాళ్ళు నీ నామాన్ని వెతికేలా వాళ్ల ముఖాలకు అవమానం కలిగించు.
కీర్తనల గ్రంథము 83 : 17 (IRVTE)
వాళ్ళు ఎప్పుడూ అవమానం, భయం అనుభవించాలి, వాళ్ళు సిగ్గుపాలై నాశనం కావాలి.
కీర్తనల గ్రంథము 83 : 18 (IRVTE)
యెహోవా అనే పేరున్న నువ్వు మాత్రమే లోకమంతట్లో మహోన్నతుడవని వాళ్ళు తెలుసుకుంటారు.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18